రజనీకాంత్ పై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు..!

siri Madhukar
సినిమా రంగంలో ఉన్నప్పుడు స్నేహితులు ఉన్న వారు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత బద్ద శత్రువులు అవుతుంటారు..ఇది జగమెరిగిన సత్యం. తాజాగా తమిళనాట ఇదే జరుగుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకప్పుడు దర్శకులు, నిర్మాత భారతి రాజా, సూపర్ స్టార్ రజినీకాంత్ మంచి స్నేహితులుగా ఉండే వారు.  ఎప్పుడైతే రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నానని ప్రకటించారో..అప్పటి నుంచి భారతి రాజా తెరపైకి వచ్చారు.  రజినీకాంత్‌ పార్టీ పెట్టకముందే అప్పుడే తమిళుడు కాని వ్యక్తి తమను పరిపాలించవద్దంటూ కొందరు నిరసనలు తెలుపుతున్నారు. అందులో ప్రధముడిగా దర్శకుడు భారతి రాజా ఉన్నాడు.

తమిళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న భారతి రాజా చేస్తున్న విమర్శలు ప్రస్తుతం తమిళ నాట పెను ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. రాజకీయాల్లో రజినీకాంత్‌ తనదైన శైలిలో రాణిస్తాడని భావిస్తున్న తరుణంలో భారతి రాజా ఇలాంటి విమర్శలు చేస్తుండటంతో రజినీకాంత్‌ వర్గంలో ఆందోళన మొదలైంది.రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఈ దర్శకుడు.. అభిమానులపై కూడా హాట్ కామెంట్స్ చేశాడు. ముందుగా.. రజనీకాంత్ తమిళుడు కాదంటూ భారతిరాజా ధ్వజమెత్తారు.

రజనీ ఎక్కడ నుంచినో వచ్చాడని.. సినిమాలు చేసుకోవచ్చు కానీ, రాజకీయాల్లోకి ఈ హీరో ఎంట్రీ ఇవ్వకూడదని భారతిరాజా అభిప్రాయపడ్డాడు.  ప్రతి తమిళుడూ నాయకుడే అని.. తమిళనాడులో పాలన గురించి మాట్లాడే అర్హత కానీ, తమిళనాడును పాలించే అర్హత కానీ రజనీకాంత్ లేదని భారతిరాజా వ్యాఖ్యానించారు.  ‘నీ కటౌట్ కు పాలాభిషేకం చేసే అమాయకులను అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వద్దామని అనుకుంటున్నావు. వాళ్లు అమాయకులు. వారిని మరింత సోమరులుగా మార్చకు, అదే చేస్తే .. నిన్ను ప్రపంచం క్షమించదు..’ అని భారతిరాజా వ్యాఖ్యానించాడు. 

తమిళనాడులో కనీసం నోటాతో కూడా బీజేపీ పోటీ పడలేదు. అలాంటి బీజేపీకి రజినీకాంత్‌ మద్దతుగా నిలుస్తాడంటూ భారతిరాజా పేర్కొన్నాడు. భారతి రాజా విమర్శల కారణంగా రజినీకాంత్‌ రాజకీయ జీవితం ఖచ్చితంగా ప్రభావం చూపతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. రాజకీయాల్లోకి రాబోతున్న సమయంలోనే తాను తమిళ వ్యక్తిని అని, తాను పూర్తిగా తమిళ వ్యక్తిని అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. ఒకవైపు కొంతమంది కోలీవుడ్ ప్రముఖులు రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని స్వాగతిస్తుండగా.. మరి కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించే శిబిరంలో ఒకరనిపించుకుంటున్నారు ఈ సీనియర్ దర్శకుడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: