కమల్ హాసన్, రజినీ కాంత్ లపై జయప్రద సెటైర్లు..!

Prathap Kaluva

ఎప్పుడైతే కమలహాసన్ మరియు రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాము అని ప్రకటించారో అప్పటి నుంచి అందరు వారి రాజకీయ జీవితం మీద విమర్శలు, సెటైర్లు వేస్తున్నారు. కొంతమంది వెల్ కమ్ చెబుతున్నారు కానీ ఎక్కువ మంది విమర్శలు సంధిస్తున్నారు. ఇపుడు కూడా అలనాటి హీరోయిన్, డ్రీం గర్ల్ వారి మీద కొన్ని కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ లో చరిశ్మ చూసి రాజకీయాల్లో కూడా అలానే అవుతుంది అనుకోకండి.


 ఇక్కడ పరిస్థితులు విరుద్ధంగా ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ప్రజలు మరొకటి అనుకుంటారు. సినిమా అంటే రెండున్నర గంటల జీవితం కానీ రాజకీయం అంటే రెండు తరాల ప్రజల భవిష్యత్తు. సినిమా రంగం వదిలి వచ్చేసి ప్రజా సేవలోకి రావడం అంత తేలిక ఏమి కాదు. ముఖ్యంగా ఇక్కడ రహదారుకు ఉండవు అన్నీ గతుకుల దారులు ఉంటాయి.


అలాంటి మంచి చెడుల విషయంలో స్తితప్రజ్ఞతతో అడుగువేయాలని ఆమె హితవుల పలికారు. ముఖ్యం గా తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం తరువాత తమిళనాడులో భారీగా శూన్యం ఏర్పడిందని ఆమె చేయపరు.కానీ ఈ సందర్భాన్నిఉపయోగించుకోవడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తే మాత్రం చాలా కష్టమని జయప్రద చెప్పుకొచ్చారు. ఇకపోతే, రాజకీయ పునరాగమనం ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: