ఒక సినిమా విడుదలకు వ్యతిరేఖంగా దేశవ్యాప్తంగా కనీవినీ ఎరుగని నిరసన

ఒక జాతి .మహిళల ఆత్మ గౌరవానికి భంగకరంగా సినిమా తీసి, ఆ జాతి పైనే కాక, దేశ గౌరవానికి మకిల అంటిస్తున్నారని, ఒక ప్రతిష్టాత్మక  చరిత్రకు అప్రతిష్టతను ఆపాదిస్తూ, వ్యతిరేఖ భావనలను దేశ వ్యాప్తంగా ఆ జాతి గౌరవాన్ని మంట గలుపుతున్నా రన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్న తరుణంలో ఐదు రాష్ట్రాల్లో ఉద్వెగం నెలకొంది.  దాదాపు ఐదు రాష్ట్రలలో మహిళలు పెద్ద సంఖ్యలో ఆత్మాహుతికి సిద్ధమౌతున్నారు, ఉద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి.


భారత దేశ చరిత్ర లోనే ఊహించని ఒక మలుపు. ఒక సినిమాకు వ్యతిరేకంగా ఏకంగా రెండు వేల మంది మహిళలు ఆత్మార్పణ కు సిద్ధమైన అరుదైన ఘట్టం. "మా మాట కాదని సినిమాను ప్రదర్శిస్తే థియేటర్ల ముందు చితిపేర్చుకుని ఆ మంటల్లో దూకి చస్తాం" అని రాజ్‌పుత్‌ మహిళలు శపథం చేస్తున్నారు.  మహిళలకు తోడు పురుషులు కూడా పెద్ద ఎత్తున నిరసనల్లో పాలు పంచు కుంటున్నారు. "పద్మావత్‌"  విడుదలకు కౌంట్డౌన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.


మరో ఐదు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గుజరాత్‌ ప్రభుత్వం బస్సు సర్వీ సు లను రద్దు చేసింది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



రాజ్‌పుత్‌ కులానికి చెందిన "రాణి పద్మావతి" ది గొప్ప చరిత్ర అని, సినిమా లతో ఆమె పరువును,ప్రతిష్ఠను, మానశీలాలను  మంట గలుపుతుంటే చూస్తూ ఊరుకోబోమని ఆ కులానికి చెందిన మహిళలు నినదించారు. ఆదివారం రాజస్థాన్‌లోని చిత్తోర్‌ ఘర్‌ పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు మూడువేల మంది రాజ్‌పుత్‌ మహిళలు పాల్గొన్నారు.


సినిమాను ప్రవర్శిస్తే తామంతా మంటల్లోకి దూకి ఆత్మార్పణ (జౌహార్‌)  చేసుకుంటామని జిల్లా కలెక్టర్‌ కు అల్టిమేటం ఇచ్చారు. ఆత్మాహుతికి - జౌహార్‌ కు సిద్ధమంటూ ఇప్పటికే రెండువేల మంది మహిళలు తమ పేర్లను రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఆ జాబితాను కూడా కలెక్టర్‌కు అందించారు.  



గుజరాత్‌లో రాజ్‌పుత్‌ ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న "హెహసానా రీజియన్‌"  లో కొద్ది గంటలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పలుచోట్ల గుజరాత్‌ ఆర్టీసీకి చెందిన బస్సులను నిరసనకారులు ధ్వంసం చేశారు. దీంతో సోమవారం నుంచి బస్సు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో పరిస్థితు లపై మంత్రి భూపేంద్ర సింహ్‌  మాట్లాడుతూ, "ఇలాంటివి చాలా సహజం"  అని అన్నారు. సినిమా విడుదలను అడ్డుకోరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశా లను అమలు చేయడం పైనే తాము దృష్టి పెట్టినట్లు చెప్పు కొచ్చారు.


పద్మావత్‌ సినిమాను మొదటినుంచీ వ్యతిరేకిస్తోన్న రాజపుత్ర కర్ణిసేన, పద్మవత్ సినిమా విడుదలయ్యేరోజు దేశవ్యాప్తంగా నిరస నలకు పిలుపునిచ్చింది. "ఇప్పటికే థియేటర్‌ యాజామాన్యాలతో మాట్లాడాం. పద్మావతిని ప్రదర్శించొద్దన్న మా డిమాండ్‌ కు చాలా మంది ఒప్పుకున్నారు. ఒకవేళ ఎవరైనా సినిమాను ప్రదర్శిస్తే జరగబోయే పరిణామాలకు వారిదే బాధ్యత. పద్మావతి విడుదలయ్యే జనవరి 25న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం"  శ్రీ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధికార ప్రతినిధి విజేంద్ర సింగ్‌ మీడియా తో అన్నారు.


ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ‘పద్మావత్’ చిత్రం ఎట్ట‌కేల‌కు ఈ నెల 25న విడుద‌ల కాబోతోన్న సంగ‌తి తెలిసిందే. ఆ చిత్రంలో రాణి ప‌ద్మిని దేవి పాత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని, ఆ సినిమాను నిషేధిం చాల‌ని రాజ్పుత్ వ‌ర్గీయులు డిమాండ్ చేస్తోన్నవిష‌యం విదిత‌మే. ఆ సినిమాను త‌మ రాష్ట్రాల్లో నిషేధిస్తున్నామ‌ని గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య ప్ర‌దేశ్, హ‌ర్యానా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించాయి. 


1540లో మాలిక్ మ‌హ‌మ్మ‌ద్ జ‌యాసి అనే ముస్లిం ర‌చ‌యిత రాసిన క‌ల్పిత న‌వ‌ల ఆధారంగా ‘పద్మావత్’ సినిమాను తెర‌కెక్కిం చార‌ని, ఆ న‌వ‌ల‌కు ఎటువంటి చారిత్ర‌క ఆధారాలు ఉన్నాయో తెలియదుగాని, రాజ్పుత్ రాణి పద్మావ‌తిదేవిగా  దీపికాపదుకోన్, అల్లాఉద్దీన్ ఖిల్జీగా రణధీర్ సింగ్ నటించారు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: