చంద్రబాబుకు షాక్ ఇచ్చిన పవన్ కల్యాణ్..!?

Chakravarthi Kalyan
ఇన్నాళ్లూ టీడీపీకి తోక పార్టీగా ఉంటూ వచ్చిన జనసేన ఇక జూలు విదల్చబోతోందా.. పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాలపై పవన్ కల్యాణ్ దృష్టి సారిస్తున్నారా.. అంటే అవుననే  అనిపిస్తోంది. ఇటీవల కొండగట్టు నుంచి యాత్ర ప్రారంభిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించగానే అనేక అనుమానాలు కలిగాయి. అనూహ్యంగా పవన్ కల్యాణ్ తెలంగాణ నుంచి 
రాజకీయ యాత్ర ప్రారంభించడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 


పవన్ తీరు ఎలా ఉంటుందా అని కాస్త ఉత్కంఠలో ఉన్న తెలుగుదేశం శ్రేణులు పవన్ నిర్ణయంతో కాస్త ఊరట చెందారు. ఏ రాజకీయ నాయకుడైనా తీవ్రత ఉన్న దగ్గర నుంచే రాజకీయం ప్రారంభిస్తాడు. అలా చూస్తే పవన్ ఏపీ కన్నా తెలంగాణలోనే ఎక్కువ సమస్యలు ఉన్నాయని ఫీలవుతున్నట్టు పవన్ భావిస్తున్నారని అనుకున్నారు. అది తమకు లాభిస్తుందని అంచనా వేశారు దేశం నాయకులు.



కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలంగాణ నుంచి యాత్ర ప్రారంభించినా.. తన ప్రధాన దృష్టి ఏపీవైపే అని కరంనగర్ ప్రెస్ మీట్లో తేల్చి చెప్పేశారు.  ఈనెల 27 నుంచి అనంతపూర్ జిల్లా నుంచి కరువు యాత్ర ప్రారంభిస్తున్నానని స్పష్టం చేశారు. అంతేకాదు ఆంద్రలో ఆఫీస్ ప్రారంభిస్తానని క్లారిటీ ఇచ్చారు. అనంతపురం తర్వాత తూర్పుగోదావరి ఏజెన్సీ,  వైజాగ్  లో సమస్యలపై చర్చిస్తానంటూ కార్యాచరణ ప్రకటించేశారు. 



ప్రస్తుతానికి ఆఁధ్రకి సంబంధించిన సమస్యలపై పోకస్ చేస్తున్నానన్న పవన్ కల్యాణ్.. సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణా వచ్చింది కాబట్టి.. సమస్యలపై అధ్యయనం చేశాక  స్పందిస్తామన్నారు. అంతే కాదు.. కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన హార్డ్ వర్కర్ అని కితాబిచ్చారు. తాను కేసీఆర్ తో వైరం కోరుకోవడం లేదని క్లారిటీగా చెప్పేసారు. అంటే పవన్ పోరాటం ప్రస్తుతానికి చంద్రబాబుపైనే అన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: