పవన్ కళ్యాణ్ ఇంత పనికమాలిన రాజకీయ నాయుకుడి లా దిగజారి పోయాడా..!

Prathap Kaluva

పవన్ 2014 లో జనసేన పార్టీ పెట్టి ప్రశ్నించడానికి వస్తున్నా అని ఎంతో ఆవేశంగా మాట్లాడినాడు. తప్పు చేస్తే ఏ రాజకీయ నాయకుడిని వదిలి పెట్టను అని చాలా సినిమా డైలాగ్స్ చెప్పినాడు. అప్పుడు పవన్ అభిమానులతో పాటు అందరు నమ్మినారు. అయితే పవన్ ప్రశ్నించడం కాదు గదా టిడిపి కి తొత్తు గా మారిపోవడం అలవాటు అయిపొయింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేపిన ఓటుకు నోటు కేసు గురించి అందరికి తెలిసిందే.


అయితే దాని పవన్ గురించి ఏమన్నాడంటే "ఓటుకి నోటు వ్యవహారం సున్నితమైన అంశం, అందుకే స్పందించలేదు" అని మెత్తగా అంటున్నారు. అది సున్నితమైన అంశం ఎలా అవుతుంది? ప్రజల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నవి లేదా వారి మనోభావాలు దెబ్బతినే విషయాలు సున్నితమైనవి అవుతాయి. కానీ టీవీలలో అందరూ వీక్షించిన "బ్రీఫ్డ్ మీ" ఓటుకి నోటు వ్యవహారం సున్నితం ఎలా అవుతుంది? అయితే పాపం పవన్ కి ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది.


డబ్బులిచ్చి ఒక ఎమ్మెల్సీ ని కొనడం తప్పు అంటే బాబు ఫీలవుతారు, తప్పుకాదు అంటే కేసీఆర్ ఫీలవుతారు. ఇద్దరిలో ఎవరినీ నొప్పించలేని ఆయనకు మాత్రమే ఇది సున్నితమైన అంశం అవుతుంది. తాను కూడా అందరిలా అవకాశవాద రాజకీయాలు చేస్తానని నిరూపించుకోవడానికి ఇలాంటి కప్పదాటు మాటలు దోహదపడతాయి. తమ నాయకుడు అన్యాయాలను, అక్రమాలను సహించడని, అవతలివాడు ఎవడైనాసరే ఎదురు తిరిగి ప్రశ్నిస్తాడని పవన్ కళ్యాణ్ అభిమానుల నమ్మకం. కానీ ఒక్క ప్రతిపక్ష నాయకుడిని విమర్శించినపుడు మాత్రమే ఆయన ఆవేశంతో ఊగిపోతారని, అధికారంలో ఉన్నవారిని పల్లెత్తుమాట కూడా అనలేని దీనమైన స్థితిలో ఆయన ఉంటారని బహుశా ఆయన వీరాభిమానులు కూడా ఊహించి ఉండరు. పవన్ కళ్యాణ్  మరీ ఇంత పనికమాలిన రాజకీయ నాయకుడు లా మారిపోయాడా అని అందరు అనుకుంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: