వేగం అంటే చైనాదే - జెస్ట్ తొమ్మిది గంటల్లో హైస్పీడ్‌ రైల్వే ట్రాక్‌ నిర్మాణం

ప్రతిభ ఒకడి అబ్బ సొత్తు కాదు! సాధనకు పూనుకుంటే అది అసాధ్యం కూడా కాదు. "తినగ తినగ వేము తియ్యనగును" అన్న సామెత మనబాషలో నిబిడీకృతమై ఉంది. ఉదాహరణకు భారత్ 104ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించి తనసత్తా నిరూపించు కుంది. అయితే ఇది ఒక్కరాత్రిలో సాధించిన ప్రగతికాదు. సంవత్సరాలుగా సాధించిన పని నైపుణ్యత సున్నితంగా పెంచుకు న్న వేగం సుతారంగా స్వంతం చేసుకున్న సాంకేతికత ఇవన్నీ కలిసి సాధించినదే మార్స్ ప్రయోగ విజయం. 


అయితే ఇది అన్ని రంగాలకు విస్తరిస్తేనే భారత్ చైనాని ఢీ కొట్టగలిగేది. భారత్ జ్కొన్ని విషయాల్లోనైనా చైనా నుంచి స్పూర్తిని పొందాలి. నేటి చైనా విజయం ఒక అద్భుతం అదేమంటే:    


అతి స్వల్ప సమయంలో భారీ ప్రాజెక్టులను పూర్తి చేయగల సామర్ధ్యం సత్తా తమ సొంతమని చైనీయులు ప్రపంచానికి మరో సారి చాటి చెప్పారు. కేవలం తొమ్మిది గంటల్లో "కొత్త రైల్వే స్టేషన్‌ కు హై స్పీడ్‌ రైలు ట్రాక్‌" (గంటకు 200 కి.మీ వేగం) ను నిర్మించి రికార్డు సృష్టించారు. రైల్వే ట్రాక్‌ నిర్మాణంలో 1,500 మంది వర్కర్లు పాల్గొన్నారు. వీరికి అవసరమైన వస్తువులను నిరంతర సరఫరాకు ఏడు రైళ్ల ను వినియోగించారు. దక్షిణ చైనా లోని ఫుజియన్‌ ప్రావిన్సులో గల లొంగ్యాన్‌ పట్టణం లోని రైల్వే స్టేషన్‌ కు హైస్పీడ్‌ రైల్వే సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో కొత్త రైల్వేస్టేషన్‌ను నిర్మించారు.స్టేషన్‌ కు హైస్పీడ్‌ రైల్వే ట్రాక్‌ను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని డిపార్ట్మెంట్ ఆదే శాలు జారీ కావడం ఆలస్యం. పూనుకున్న 1500 మందితో కేవలం తొమ్మిది గంటల్లో నిర్మించి రికార్డు సృష్టించారు. కొత్తగా నిర్మించిన "నాన్‌లాంగ్‌ రైల్వే లైను" ను మరో మూడు లైన్ల కు అనుసంధానించడంతో టాస్క్‌ పూర్తైంది. అంతేకాకుండా స్టేషన్‌ కు రైళ్ల సమాచారాన్ని చేరవేసే ట్రాఫిక్‌ మానిటరింగ్‌ సిస్టం ను సైతం అమర్చారు. 2018చివరకల్లా 246కిలోమీటర్ల మేర "నాన్‌ లాంగ్‌ రైల్వే లైను"ను విస్తరించాలని చైనా యోచిస్తోంది. ఇది పూర్తైతే ఈశాన్య చైనా నుంచి సెంట్రల్‌ చైనాకు ప్రయాణం సులభ తరం అవుతుంది.


చైనా పనివారలు (వర్కర్లు) పని నైపుణ్యత, సునాయాస సామర్ధ్యం (ఈజ్) సమయపాలన, బృందంలో ఒకరితో ఒకరు కలుపు కొని పనిచేయటం, లక్ష్యమే సమూహ ధ్యేయం అనేవి అతి తేలికగా సాధించే విషయాలు కావు. వాటి వెనక వారికున్న "లక్ష్యం పై ఒకరు కాదు - అందరు కలసి" సాధించాలన్న క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: