జనంలో ముఢాచారాలను చాదస్థాలను పరాకాష్టకు తీసుకెళుతున్న టీవీ చానళ్ళు

రోజుల తరబడి గంటల కొద్దీ  ఆచారాల పేరుతో అత్యంత ధారుణంగా పుంఖానుపుంఖాలుగా అనాచారాలను ప్రాచుర్యంలోకి తీసుకురావటం హిందూ జాతి చేసుకున్న దుర దృష్టం. విఙ్జానం అంతగా ప్రాచుర్యంలోకి రానిరోజుల్లో ప్రచారంలో ఉన్న అనేక అనాచారాలను తిరిగి బ్రతికించటం అత్యంత హేయమైన చర్య. ఖగోళం లో నేడు అద్భుతం జరగబోతోంది. దాదాపు 150 సంవత్సరాల తర్వాత కనిపిస్తున్న అద్భుతమంటూ అంతర్జాలంలో ఊదరగొడుతున్నారు. గ్రహణకాలంలో తీసుకో వాల్సిన జాగ్రత్తలు, ఏ రాశి, నక్షత్రం వారు ఎలాంటి పూజలు చేయాలో వాట్సాప్స్‌లలో ఉచిత సలహాలనూ సర్క్యులేట్‌ చేస్తున్నారు.


గ్రహణ సమయంలో గర్భిణిలు బయటకు రాకూడదు. గ్రహణ సమయంలో ఏమీ తినరాదు అనేది కూడా ఒక అర్ధం లేని అను మానమే. దానికి శాస్త్రీయంగా ఎలాంటి నిరూపణలు లేవు. 



సూర్యుడు..భూమి..చంద్రుడు తమ తమ పరిభ్రమణంలో వివిధ కక్ష్యల్లో ఉంటాయి. కాని ఒకేసారి ఈ పరిభ్రమణ కక్ష్యలు ఒకే వరుసలో కొంత సమయం ఉండటం వల్ల ఒక దానికి ఒకటి అడ్డొచ్చి "గ్రహణం" ఏర్పడుతుంది. ఆ సందర్భంగా పెద్దదైన భూ గ్రహం నీడ చంద్రుణ్ణి పాక్షికంగా కాని సంపూర్ణంగా కాని కప్పేయటం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతుంది. అయితే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసలోకి వతే అది "సంపూర్ణ చంద్రగ్రహణం" అవుతుంది.


భ్రమణ సమయంలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సంభవించే పౌర్ణమిని ‘‘సూపర్‌ మూన్‌’’గా పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే కాస్త పెద్దగా కనిపిస్తాడు. మరోవైపు ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని ‘‘బ్లూ మూన్‌’’గా పిలుస్తారు. చంద్రగ్రహణంనాడు ఒక్కోసారి భూమి వాతావరణం గుండా చంద్రుడిపై సూర్యకిరణాలు పడతాయి. దీంతో చంద్రుడు గోధుమ వర్ణంలో కనిపిస్తాడు. ఈ పరిణామాన్ని బ్లడ్‌ మూన్‌గా చెబుతారు. బ్లూ, బ్లడ్‌, సూపర్‌ మూన్‌లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే ఈ మూడు కలిసి రావడం అత్యంత అరుదు. 


ఇలా జరగటం ప్రకృతిపరంగా ఒక సహజ ప్రక్రియ. చంద్ర గ్రహణాన్ని కంటికి కనిపిస్తే చూడటం ఒక అద్భుత అనుభూతి. సాధారణం గా చంద్ర గ్రహణ వీక్షణానికి జాగ్రత్తలు అవసరం లేదు. సాధారణ కంటితో చూసినా ఇబ్బందులుండవు. సాధా రణంగా గ్రహణ సమయంలో గర్భిణిలు బయటకు రాకూడదు లాంటి అపోహలు ఉన్నాయి. అయితే చంద్రగ్రహణాన్ని నేరుగా చూడవచ్చు. నేరుగా చూడటంపై అనుమానం ఉన్న వారు "టెలిస్కోప్‌" ల ద్వారా శుభ్రంగా చూడవచ్చు.


సూర్యగ్రహణం అయితే  "ఆల్ట్రావయెలెట్ కిరణాలు" పరావర్తనం చెందటం ద్వారా నేరుగా భూమిని తాకడం వల్ల కొంత హాని జరగొచ్చు.  సూర్యగ్రహణాన్ని నేరుగా చూడవద్దని అందుకే చెబుతుంటారు. ఆచార వ్యవహారాల చాటునుండి పెరిగిపోతున్న ఈ అనాచారాలకు టెలివిజన్ చానళ్ళు అనవసర ప్రచారం కలిగించి అమాయకు లను ఆ  ఊబి లోకి నెట్టటం వీటికి ఎంతవరకు సమంజసం? 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: