టిడిపి ఎంపీలు అసలు ఆందోళన ఎందుకు చేశారు? ఎందుకు విరమించారో? బ్రహ్మదేవునికైనా తెలుసా!

వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు విభజిస్తే ఎలాంటి వివాదాలు రాలేదని, కాంగ్రెస్‌ పార్టీ ఒక్క రాష్ట్రాన్ని విభజిస్తే నాలు గేళ్లుగా విభజన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. లోక్‌సభలో ఆయన మాట్లాడు తూ, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్‌ విభజించిన తీరు వల్లే ఇన్నేళ్లయినా సమస్యలు అలాగే ఉన్నాయన్నారు.


ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ టిడిపి ఎంపీలు నిరసన చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర విభజన గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రయోజనం కోసమే కాంగ్రెస్ పార్టీ హడావిడిగా రాష్ట్రాన్ని విభజించిందని ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ విభజించిన తీరే సమస్యలకు కారణమైందన్నారు. ఎన్నికల కోసం రాష్ట్రాన్ని సక్రమంగా విభజించలేదన్నారు. 


నాలుగేళ్లయినా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలవల్ల 125 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రని మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ బుధవారం పార్లమెంట్‌‌లో ఈ వ్యాఖ్యలు చేశారు 


తెలంగాణ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని మేం కూడా విభజనకు మద్దతు పలికామని ప్రధాని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముక్కలు చేసిందని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. కానీ ఇలాంటి సమస్యలు తలెత్త లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజా ప్రయోజనా లను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలను విభజించామని మోదీ తెలిపారు.


ఒక దళిత ముఖ్యమంత్రిని హైదరాబాద్‌లో రాజీవ్ గాంధీ అవమానించారు. దీంతో తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగు దేశం పార్టీ ఏర్పాటైందని మోదీ తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడేందుకే ఎన్టీఆర్ సినిమాలు వదిలేసి రాజకీయా ల్లోకి వచ్చారన్నారు. కాంగ్రెస్, నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించలేదన్నారు. ఆంధ్రుడైన నీలం సంజీవరెడ్డిని అవ మానించింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని మోదీ గుర్తు చేశారు.  పార్లమెంట్ సాక్షిగా తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీ ఎంపీలు నిరసన ప్రదర్శనలు చేస్తుండటంపై కూడా మోదీ స్పందించారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగలొద్దని ఆయన ఎంపీలకు హితవు పలికారు. ప్రధాని ప్రసంగం సమయంలో ఆందోళన విమరించిన ఎంపీలు తమ తమ స్థానాల్లో కూర్చున్నారు.


దీన్ని బట్టి తెలుగుదేశం ఎంపిలు ఏమిసాధించినట్లు. వీళ్ళ బలహీనత నరెంద్ర మోడీ కి బాగా తెలుసనుకుంట. ఎక్కడపట్టాలో అక్కడపట్టేసి నోరు మూయిస్థాడు.నాలుగేళ్ళుగా జరిగే తంతు ఇదే. అయినా తెలుగువాళ్లకు ఆయన అర్ధంకారు వాళ్లకు ఆయన ఏమీ చేయరు. భలేగా అడేసుకుంటున్నారు మోడీ  వారి బలహీనతతో.  ఈ శాసనసభ్యులు తమ ప్రతాపం చూపించ బోతున్నా రను కుంటాం? మోడీని చూడగానే జావ గారి పోతారేమిటో? ఇలాంటి వాళ్లు ప్రజలకేం చేస్తరో?  మరేం చేస్తరో గిట్లయితే? 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: