పార్లమెంట్ మోడీ స్పీచ్ పై కౌంటర్ ఏటాక్

"ఏవీ ఆనాటి విశ్వాస పూరిత ప్రసంగాలు? ధారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు నాడిచ్చిన ఆత్మస్థైర్యం? ఆ మాటలు నీటి మూటలా? చట్తసభల ద్వారాలు మూసేసి విభజన చట్తం చేసిన కాగ్రెస్ అనుమానం లేదు తెలుగు జాతి పాలిట క్రూర మృగమే. ఆ ధౌర్భాగ్యాన్ని ప్రజలు ఏనాటికీ మరచిపోరు. వారు చేసిన దుష్ట పాలన ఫలితమే నేడు దేశం అనుభవిస్తుంది. ఈ విషయం భారత ప్రధాని మరల గుర్తుచేయవలసిన అవసరం లేదు. కారణం ప్రజలు కాగ్రేస్ ను గద్దెనుంచి దింపేశారు. పాలన పగ్గాలు మీచేతి కిచ్చారు ఇప్పుడు ఆ గాయాన్ని మాంపాల్సిన మీరు గాయాన్ని గుర్తుచేయటం అవసరమా? ఇప్పుడు మీరు న్యాయం చేయండి" ఇదీ సామాన్య పౌరుని ఆక్రంధన.    



అందుకే ప్రధాని నరెంద్రమోదీ ప్రసంగంపై అనేకుల నుండి ఒకేరకమైన కౌంటర్లు పడ్డాయి. కాంగ్రెస్‌తో పాటూ బీజేపీ మిత్రపక్ష మైన శివసేన ప్రధానిపై పంచ్‌ డయలాగ్స్ పేల్చేశారు. పదవిలోకి వచ్చి నాలుగేళ్లైనా ఇంకా ఆయన రియలైజ్ కాలేదని మైత్రి ని వదిలేసిన మిత్రపక్షం "శివసేన" మండిపడింది. కాంగ్రెస్‌తో విసిగిపోయేకదా! ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్న విషయాన్ని మర్చిపోకూడదని గుర్తు చేశారు. ఇప్పటికైనా బాజపా కళ్లు తెరిస్తే మంచిదని సలహా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రజలు సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ది కోరుతున్నారు. "మరణించిన కాంగ్రెస్‌" పై ఇంకెన్ని విమర్శలు చేసినా ఉపయోగం లేదన్నారు.


 అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఏమి చెప్పారో, అధికారంలోకి వచ్చాక ఈ నాలుగేళ్ల లో ప్రజలకు ఏం చేశారో ఒక సారి ఙ్జప్తికి తెచ్చుకొంటే మంచిదన్నారు. "చింత చచ్చినా పులుపు చావని కాంగ్రెస్"  కూడా నరెంద్ర మోదీ ప్రసంగంపై తన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఎన్నికల సభ కాదని ఈ ప్రసంగం కూడదని  "పంచ్" వేశారు రాహుల్ గాంధి. అవినీతి రహిత పాలనంటున్న ప్రధాని "రఫేల్ డీల్‌" పై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రజలకు ఏవేవో చేశామని చెప్పు కుంటున్న నరెంద్ర మోదీ 2014లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏంత నెరవేర్చారో గుర్తు చేసుకోవాలన్నారు. కోటి ఉద్యోగాల హామీ ఏమందైని కూడా కాంగ్రెస్ అధినేత ప్రశ్నించారు. 


ప్రధాని ప్రసంగంలో పస లేదని కొత్త దనం కూడా ఏమీ లేదన్నారు మరో కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్. ప్రధాని మోదీ మంచిమాట కారని, ఆయన ఉపన్యాసం మొత్తం అర్ధ సత్యాలు, స్వకుచ మర్ధనాలు, యాధార్ధాన్ని వక్రీకరించటంతోనే సాగిందన్నారు. బీజేపీ పాలన ఎలా ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని, వాస్తవాల గురించి మాట్లాడితే బావుంటుందన్నారు.


మొత్తం మీద మోడీ పాలనపై దాడి (తెలుగుదేశం కాకుండా) - ఇతర ప్రతిపక్షాలు, బిజేపి మిత్రపక్షాలనుండి బలంగానే జరిగింది. మొత్తం మీద తెలుగు దేశం పార్లమెంట్ సభ్యుల వ్యక్తిగత అవకాశవాద బలహీనతలు, ఆ పార్టీ అదినేతపై ప్రజల్లో ఉన్న ఆరోపణల వలననే ఏపికి రావలసిన నిధులు మోడీ ప్రభుత్వం విడుదల చేయటం లేదంటు న్నారు. పోలవరం అమరావతి నిర్మాణాలు ఇప్పటికే అవినీతిలో కూరుకు పోయాయని తెలుస్తుంది. అవసరమైతే నరెంద్ర మోడీ వాటిని బయట పెట్టాలి గాని,  రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిచగూదని విశ్లేషకుల భావన. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: