తమిళనాడు అసెంబ్లీలో ‘జయలలిత’ చిత్రపటం..!

Edari Rama Krishna
తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలిత భారీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.  సీఎం ఈ పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సమక్షంలో అసెంబ్లీ స్పీకర్ పీ.ధనపాల్ సోమవారం జయలలిత చిత్రపటాన్ని ఆవిష్కరించారు. తమిళనాడులో పేదల మనిషిగా పేరు తెచ్చుకున్న ఎంజీఆర్ తర్వాత అన్నాడీఎంకే తరుపు నుంచి జయలలిత ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు.  అప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలు తీసుకు వచ్చి ప్రజల చేత అమ్మ అని పిలిపించుకున్నారు. 

ఓ వైపు ప్రత్యర్థుల సవాళ్లను ఎదుర్కొంటు..ఎంతో క్లిష్టమైన సమస్యలు పరిష్కరిస్తూ..కేంద్రంతో సన్నిహితంగా ఉంటూ..తమిళనాడు అభివృద్ది కోసం పాటుపడ్డారు జయలలిత.  గత సంవత్సరం ఆమె అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరడం..అక్కడ ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది.  అయితే కొన్ని రోజుల తర్వాత అమ్మ మరణించారని వార్త చెప్పడంతో తమిళనాడు మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. 

ఆ తర్వాత తమిళనాట రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేర్పులు సంబవించాయి.  గత కొంత కాలంగా తమిళనాడు అసెంబ్లీలో అమ్మ చిత్రపటాన్ని ఆవిష్కరించడానికి సన్నాహాలు జరిగాయి.  దీనిపై విపక్షాలు అభ్యంతరం చెప్పినా..ముఖ్యమంత్రి పళని స్వామి మాత్రం తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జయలలిత భారీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.  సీఎం ఈ పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సమక్షంలో అసెంబ్లీ స్పీకర్ పీ.ధనపాల్ సోమవారం జయలలిత చిత్రపటాన్ని ఆవిష్కరించారు.

తమిళనాడు మాజీ సీఎంలు సీఎన్ అన్నాదురై, ఎంజీ రామచంద్రన్ సహా 10 మంది మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలతో పాటుగా జయలలిత భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి  విపక్ష డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు బహిష్కరించాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషిగా తేలడంతో అసెంబ్లీలో ఆమె చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం సరికాదని డీఎంకే అభ్యంతరం చెప్పింది. తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో సోమవారం బ్లాక్ డే‌గా డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: