ప్రత్యేక హోదాకి, ప్రత్యేక ప్యాకేజికి కొత్త నిర్వచనం చెప్పిన వైసిపి ఎమెల్యే రోజా

ఆంధ్రప్రదేశ్ కి "ప్రత్యేక హోదా" విషయంలో అటు అధికార, ఇటు ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా కొనసాగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ ఫైర్-బ్రాండ్ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. 


ఆమె ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కు, ప్రత్యేక ప్యాకేజీ కి ఉన్న భేదాన్ని కొత్తగా నిర్వచించారు రోజా. "ప్రత్యేక హోదా అనేది జగన్ లాంటిదని ప్రత్యేక ప్యాకేజీ అనేది ముఖ్యమంత్రిగారి ఇంట్లో పనికి రాని పప్పు లాంటిది" అని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని అది వచ్చినప్పుడే ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్ లాగా అవుతుందని గత నాలుగేళ్లుగా వైసిపి అధినేత చెబుతూనే ఉన్నారని రోజా అన్నారు. 


ఇక కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసన తెలుపుతూ, విభజన హామీలు నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పార్లమెంటు వేదికగా టీడీపీ ఎంపీలు చేస్తున్న ఆందోళనలు, నిరసనలపైనా రోజా తీవ్ర విమర్శలు కూడా చేశారు. 

విజయవాడ సెక్స్ రాకెట్ లో ప్రమేయంఉన్న టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండుకొట్టించుకుని నిరసన తెలియజేస్తే,  ఇంకో బోడి గుండాయన (పరోక్షంగా గల్లా జయదేవ్) కేంద్రం మనకు ఏదో చేసిందని చెప్పి ఆహ్వానాలు సన్మానాలు చేయించుకుని ఊరంతా ఊరేగుతున్నారని రోజా విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రానికి  రావాల్సిన "ప్రత్యేక హోదా" ను కేంద్రం వద్ద తాకట్టు పెట్టింది నిజం కాదా? అని రోజా ప్రశ్నించారు. 

"సమయానికి టాయిలెట్లు కట్టించకపోతేనే జిల్లా కలెక్టర్లపై పోరాటం చేస్తానంటూ ముఖ్యమంత్రి వారిని బెదిరిస్తున్నారు. మరి, ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదా ఇవ్వనందుకు కేంద్రం ప్రభుత్వంపై పోరాటం చేస్తానని అన్న ముఖ్యమంత్రి ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు?" అని రోజా రాష్ట్రాన్ని, ఆ ప్రభుత్వాన్ని, అధినేతని నిలదీశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: