అక్కడ సైన్యంలో మహిళలు..! రేప్ చేసినా దిక్కు లేదు..!

Chakravarthi Kalyan
సైన్యంలో అధికారులు అనగానే మనం ఏమేమో ఊహించేసుకుంటారు. ఖాకీ డ్రస్సు చేతిలో తుపాకీ.. అధికార దర్పం.. సాధారణంగా  సైన్యంలో పని చేసేవాళ్లు సామాన్యుల కంటే భిన్నంగా ఉంటారు. అధికారం చేతిలో ఉందన్న భావనలో ఉంటారు. ధైర్యంగానూ ఉంటారు. కానీ ఓ దేశంలో మాత్రం సైన్యంలో మహిళలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇటీవల ఓ మీడియా అక్కడ సైన్యంలో మహిళల ఇబ్బందులపై ప్రత్యేక కథనం రాసింది. 


సంచలనం సృష్టిస్తున్న ఆ కథనం ఇలా ఉంది. ఇలా సైన్యంలో ఇబ్బందులు పడుతున్న దేశం ఉత్తర కొరియా. ఇక్కడ సైన్యంలో మహిళలపై చాలా దారుణాలు జరుగుతున్నాయట. మహిళలపై అత్యాచారం చాలా కామన్ అంటున్నారు. సైన్యంలో పనిచేస్తున్నా సరైన ఆహారమే ఇవ్వరడ మహిళలకు. చిన్న చిన్న చెక్క గదుల్లో పది పన్నెండు మంది నివసించాలట. 


సరైన పోషకాహారం లేక చాలా మందికి సరిగ్గా నెలసరి కూడా రాని దుస్థితి ఉందట. అన్నింటి కంటే దారుణం ఏంటంటే..  మహిళలకు సరైన స్నానం సదుపాయాలు కూడా లేవట. పర్వతాల నుంచి ప్రవహించే నీటితోనే స్నానం చేసుకోవాలి. వాటిలో కప్పలు, పాములు కూడా వస్తాయట. మరి ఇంత దారుణంగా ఉంటే మహిళలు సైన్యంలో ఎందుకు చేరుతున్నారనే కదా మీ సందేహం.. తీవ్రమైన ఆకలి, కరవుతోనే మహిళలు సైన్యం బాట పడుతున్నారట. 


సైన్యంలోని కమాండర్లు మహిళా సైనికులను తమ గదుల్లోకి పిలిపించుకుని బలవంతంగా వారితో సెక్స్ చేస్తారట. బెదిరించి తమ లైంగిక వాంఛలు తీర్చుకుంటారట. ఇది ఇక్కడ సర్వసాధారణమని.. మహిళా సైనికులు ఈ అత్యాచారాలపై మాత్రం నోరు తెరిచి బయటకు మాట్లాడరట. చాలా సందర్భాలలో మహిళా సైనికులు అత్యాచారాలపై  సాక్ష్యం చెప్పేందుకు  ముందుకు రావడం లేదట. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: