కాపు రిజర్వేషన్ బిల్ - ఏపికి షాక్

కాపు రిజర్వేషన్ బిల్ ఏపికి షాక్ - రాజకీయ నాయకులు పార్టీల అధినేతలు తమ స్వార్ధ ప్రయోజనాలకు ఎవేవో అలవికాని వాగ్ధానాలు చేస్తూ నేపం వేరే మిత్రపక్షంపై లేక పోతే విపక్షంపైకి తోసేస్తూ ఉంటారు. మనకు ఇవెప్పుడూ ప్రతిరోజూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సర్వ సాధారణంగా కనిపించే రాజకీయ దినచర్య. అలాంటి వాగ్ధానాలలో చెప్పుకోదగినవి కల్మష పూరిత మైనవి అసలు చట్టపరంగా సాధ్యం కానివి ప్రధానంగా రెండు. మొదటిది ఆంధ్రప్రదేశ్ లో కాపులకు అలవికాని రిజర్వేషణ్ ప్రకటించి అధి కారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేడు ఆ వాగ్ధానం అలవికానిదని కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో తెలిసి పోయింది. రెండోది తెలంగాణాలో ముస్లిములకు 12% రిజర్వేషణ్లు ప్రకటించటం.


ఇంకేం ఇప్పుడు ఈ అలవికాని వాగ్ధానం చేసిన తెలుగుదేశం అధినేత దీని అమలుకు కేంద్రం లోని బాజపా ప్రభుత్వం అడ్డు పుల్ల వేసిందని అందుకే ఈ ఎన్నికల వాగ్ధానం అమలుకాదని ప్రజలకు షాక్ ఇస్తుంది. ఈ వాగ్ధానం అమలు చేయపోవటానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజా వ్యతిరేఖత ఎదుర్కొనే బాజపాపైకి నెట్టేసిన టిడిపి అధినేతది ఏరకమైన రాజకీయం అంటారు. అంతా తెలిసే తెలుగుదేశం అధినేత చేసిన కుతంత్రం కాదా ఇది? అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  


ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే విద్య, ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని 2014 ఎన్నికల్లో టీడీపీ వాగ్దానం చేసింది. దీనికి అనుగుణంగానే కాపు రిజర్వేషన్ బిల్లును డిసెంబరులో శాసనసభ ఆమోదించి, దానిని గవర్నర్‌కు పంపింది.


నిబంధనల ప్రకారం గవర్నర్ ఈబిల్లును రాష్ట్రపతి ఆమోదానికిపంపారు. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత ఈ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తవు. రాజ్యాంగంలోని చేర్పించాల్సి ఇటువంటి బిల్లుల ఆమోదానికి ముందు, కేంద్ర హోంశాఖ సలహా లు, సూచనలను రాష్ట్రపతి తీసుకుంటారు.


యథావిధిగా రాష్ట్రపతి ఏపీ ప్రభుత్వం పంపిన బిల్లును కూడా హోంశాఖకు పంపారు. ఆయన పంపిన బిల్లుపై శిక్షణ వ్యవహా రాల శాఖ, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రైనింగ్  (డీవోపీటీ) అభిప్రాయాన్ని హోంశాఖ కోరింది. ప్రధాని స్వయం గా పర్యవేక్షించే డీవోపీటీ కాపు రిజర్వేషన్ బిల్లును నిలిపివేయాలంటూ హోంశాఖకు సూచించింది.


దీనికి కేంద్రం 1992 ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే తీర్పును ఋజువు గా చూపింది. అదే విషయాన్ని డీవోపీటీ హోంశాఖకు స్పష్టం చేసింది. ఇందిరా సాహ్ని కేసులో 1992 నవంబరు 16 న 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెల్లడిస్తూ, రాజ్యాంగం కల్పించిన మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించ కూడదని తెలిపింది. ఈ కేసును ఉదహరిస్తూ ఏపీ పంపిన బిల్లు ను నిలిపి వేయాలని రాష్ట్రపతికి విన్నవించాలని హోంశాఖకు డీవోపీటీ సూచించింది. 


“50 శాతానికి మించి రిజర్వేషన్ కోటాను ఏ ప్రాతిపదికన, ఎందుకు ఇవ్వాలో ప్రభుత్వం వివరణ ఇవ్వలేదనే ఒకే ఒక్క కారణంతో డీవోపీటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కారణాన్ని సాకుగా చూపి బిల్లును నిలిపివేయడంపై ప్రభుత్వ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి”  కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడానికి మంజునాథన్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు గత డిసెంబరులో "ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ బిల్లు" ను శాసనసభ ఆమోదించింది. 


అంతా తెలిసి అలవికాని వాగ్ధానం చేసిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది షాక్ గా కనిపించినా ఈ షాక్ తెలుగు దేశం ప్రభుత్వం కాపు జనులకు ఇచ్చిన షాకింగ్ బహుమతిగా చెప్పవచ్చు. ఇంకేం తెలుగుదేశానికి మద్దతు ఇవ్వటానికే పుట్టిన కొన్ని పత్రికలు వెబ్-సైట్స్ అప్పుడే కేంద్రానికి వ్యతిరేఖంగా ప్రచారం ప్రారంభించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: