లోకేశ్ విజన్ చూసి అధికారులు షాక్..!

siri Madhukar
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీలోకి వచ్చిన తర్వాత ఆయన తనయుడు నారా లోకేష్ బాబు ఐటీ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి తండ్రి బాటలో నడుస్తూ..ఏపీలో ఐటీ రంగ అభివృద్ది కోసం పోరాడుతున్నారు.  ఇప్పటికే పలు దేశాల్లో పర్యటనలు చేస్తూ విదేశీ పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నారు.  ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా..అవేవీ పట్టించుకోకుండా తన దారిలో తాను వెళ్లిపోతున్నాడు.  వారసత్వపు రాజకీయ ప్రభావం తనపై పడకుండా తన టాలెంట్ ఏంటో నిరూపిస్తున్నారు లోకేష్ బాబు.   అయితే పట్టణాల్లో ఐటీ రంగం ఎంత అభివృద్ది చెందినా...గ్రామాలను విస్మరిస్తే..ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లే అన్న విషయం గుర్తించిన నారా లోకేష్ బాబు.

పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. ఎంతగా ఐటీ రంగం అయినా..నా పల్లెలు బాగుపడకపోతే.. అభివృద్ది లెక్కలు అన్నీ దాని ముందు దిగదుడుపే. అందుకే ఏపీ పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేశ్ పల్లెల బాగుపై దృష్టి పెట్టారు. ఇటీవల సచివాలయంలో ఉపాధిహామీ పథకం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ,ఎల్ఈడి లైట్లు, గ్రామీణ నీటి సరఫరా పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ పల్లెలపై తన విజన్ ను ఆవిష్కరించారు.   జనం మనపై పెట్టుకుని ఆశలను అందుకుని తీరాలి.. అంటూ అధికారులకు లోకేశ్ సూచించారు.

రాష్ట్ర విభజన తరువాత లోటు బడ్జెట్ తో సహా అనేక సమస్యలు ఎదుర్కుంటున్నా... గ్రామాల అభివృద్ధికి ఎలాంటి లోటూ రాకూడదన్నారు. ఈ పథకంలో భాగంగా ఈ సంవత్సరం 24 కోట్ల పనిదినాలు పూర్తి చెయ్యాలని అధికారులకు లోకేశ్ టార్గెట్ విధించారు. 18 కోట్ల 40 లక్షల పని దినాలు ఇప్పటి వరకూ పూర్తి చేసాం.. ఇంకా 5 కోట్ల 60 లక్షల పనిదినాలు ఉపాధి కల్పించాలన్నారు.

గత రెండు నెలలుగా కొన్ని జిల్లాలో పెర్ఫార్మెన్స్ కొంత తగ్గిందని ఆయన ఆవేదన వ్యక్తం  చేశారు. కొన్ని జిల్లాల్లో ఫార్మపాండ్స్, వెర్మి కంపోస్ట్ కేంద్రాల నిర్మాణం అనుకున్నంత వేగంగా జరగడం లేదు. పనుల వేగాన్ని పెంచాలి. వివిధ విభాగాల్లో లోకేశ్ టార్గెట్లు ఇచ్చారు. ఇచ్చిన టార్గెట్లు సాధించే లక్ష్యంతో అందరూ పని చేయాలని లోకేశ్ ఆదేశించారు. వేసవిలో తాగునీటి సరఫరా,ట్యాంకర్ల పర్యవేక్షణ కోసం అధునాతన టెక్నాలజీతోయాప్ సిద్ధం చేశామని లోకేశ్ తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: