జగన్ స్పీడ్ కు ఇక బ్రేకులు..! కాస్కో అంటున్న సీనియర్..!!

Vasishta

అవును... చంద్రబాబు సీరియస్ పొలిటీషియన్ గా అవతారమెత్తబోతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు చాలా మారిపోయారు. సీరియస్ పొలిటీషియన్ లా కాకుండా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. రాజకీయంగా తనకు తిరుగులేని విధంగా గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు తనదైన శైలిలో జూలు విదల్చబోతున్నారు.


          అరుణ్ జైట్లీ బడ్జెట్ తర్వాత రాష్ట్రం మొత్తం అన్యాయంపైనే మాట్లాడుకుంటోంది. అధికారంలోని బీజేపీ-టీడీపీ మధ్య దూరం రోజురోజుకూ పెరిగిపోతోంది. రెండు పార్టీలూ సై అంటే సై అనుకుంటున్నాయి. సవాళ్ల నేపథ్యంలో వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నాయి. ఇంత జరిగినా బీజేపీ అధిష్టానం కూడా అంతే స్థాయిలో బెట్టు ప్రదర్శిస్తోంది. ఒక్కసారైనా ప్రధాని కానీ, అమిత్ షా కానీ చంద్రబాబుకు ఫోన్ చేసి పలకరించలేదు. దీన్ని బట్టి బీజేపీ కూడా మెట్టుదిగే పరిస్థితి లేదని అర్థమైంది. దీంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు.


          బీజేపీ మొండి వైఖరి ప్రదర్శించడానికి, తమను లైట్ తీసుకోవడానికి ప్రధాన కారణం వైసీపీయేనని చంద్రబాబు క్లారిటీకి వచ్చారు. బీజేపీ కూడా చంద్రబాబు లేకుంటే జగన్ ఉన్నాడనే భరోసాతో రెచ్చిపోతోందని తెలుసుకున్నారు. దీంతో ఇకపై అటు వైసీపీ., ఇటు బీజేపీని టార్గెట్ చేసి సీరియస్ పాలిటిక్స్ ప్లే చేయాలనుకుంటున్నారని అంతర్గత సమాచారం. ముఖ్యంగా వైసీపీని దెబ్బ కొట్టడం ద్వారా బీజేపీ ఆటోమేటిక్ గా దారికొస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ముందుగా వైసీపీని దెబ్బకొట్టబోతున్నారు.


          వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి లెక్కల ప్రకారం టీడీపీకి 2, వైసీపీకి 1 స్థానం సులువుగా దక్కుతాయి. అయితే ఆ ఒక్కటి కూడా వైసీపీకి దక్కకుండా చూసేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారు. ఇందుకోసం త్వరలోనే మరికొంతమందిని టీడీపీలో లాక్కోబోతున్నారు. తద్వారా వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేయాలనుకుంటున్నారు. ఎంపీకి కనీసం 42 మంది ఎమ్మెల్యేలు అవసరం. ప్రస్తుతం వైసీపీ దగ్గర 44 మంది ఉన్నారు. అయితే ఏమాత్రం పొరపాటు జరగకుండా ఉండేందుకు త్వరలో మరో నలుగురు ఎమ్మెల్యేలను టీడీపీ గూటికి చేర్చుకునేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. తద్వారా 40 మంది మాత్రమే వైసీపీకి మిగులుతారు. అప్పుడు ఆ పార్టీకి ఎంపీ ఛాన్స్ ఏమాత్రం ఉండదని చంద్రబాబు నిర్ధారణకు వచ్చారు.


          తాను నిత్యం రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడుతుంటే.. అనవసర రాజకీయాలతో రాష్ట్రాన్ని, తమను జగన్ ఇబ్బంది పెడుతున్నాడని చంద్రబాబు ఫుల్ ఫైర్ లో ఉన్నారు. బీజేపీకి లేనిపోని విషయాలు చెప్పి రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని, తద్వారా రాష్ట్రం నష్టపోతోందని చంద్రబాబు ఆవేదన చెందుతున్నారట. అందుకే ఇకపై చూసీచూడనట్లు కాకుండా సీరియస్ పాలిటిక్స్ నడపాలని చంద్రబాబు డిసైడైనట్లు సమాచారం. అంతేకాదు.. ఇకపై అన్ని యాంగిల్స్ లో వైసీపీ అంతు చూడబోతున్నట్టు వినికిడి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: