ఇది జన హృదయం మిస్టర్ పవన్ కళ్యాణ్ - పరువు ప్రతిష్ఠ జాగ్రత్త

నిధులు ఇచ్చి కేంద్రంలో అధికారంలో ఉన్న బాజపా నాయకత్వం ప్రజలు పార్టీలు లెక్కలు అడిగితే అంతర్జాలంలో "సో అండ్ సో వెబ్-సైట్" లో చూసుకోండని, శ్వేత పత్రం ప్రకటించమని అడిగితే అవసరం లేదని, కొన్నిసార్లు ప్రకటిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సారిగా తమ లెక్కల చిట్టా పవన్ కళ్యాణ్ తన "జే ఎఫ్ సి" తరపున కోరగానే కొంత ఆలశ్యంగానైనా స్పందించారు. ఇది ముదావహం.

ఎందుకంటే "పవన్ మన వాడే శ్వెత పత్రం అడిగితే కాస్త సంయమనం పాటించి సున్నితంగా సమాధానం ఇవ్వండి" అని టిడిపి అధినేతే స్వయంగా తనపార్టీ ప్రజాప్రతి నిధుల సమన్వయసమావేశం సందర్భంగా ప్రకటించారు. అంటే జే ఎఫ్ సి ఏర్పాటులోని నేపధ్యం, దాని అంతరంగం, ఉద్దేశించిన ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని అర్ధమౌతూనే ఉంది. 

అందుకే దీనికి కాంగ్రెస్ వైసిపి డుమ్మా కొట్టేశాయి. ఈ గణాంకాలపై పరిశీలన అనంతరం తప్పెవరిది? అన్న విషయం నిర్దారిస్తారని పవన్ చెప్పినది ఎలా ఉండ బోతుంది?  అనేది అందరికి అర్ధమైంది. అయితే ఏమని నిర్ధారిస్తారనేది కొంతలో కొంత మనకు అవగతమౌతూనే ఉందని పవన్ కళ్యాణ్ నైజం తెలిసిన వారు ప్రకటిస్తూనే ఉన్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులకు లెక్క చెప్పవలసిన అవసరం లేదని ప్రజా శ్రేయోభిలాషి లోక్-సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, మాజీ ఐఏసెస్ నొక్కి వక్కాణించారు. ఒక అనుభవఙ్జుని పరిఙ్జానం ఇంత నేలబారుగా ఉంటుందా? అనేది అసలు పాయింట్. దానిపై ఫోకస్ చేస్తూ మాజీ ఏపి చీఫ్ సెక్రెటరి ఐవైఆర్ కృష్ణారావు గారు సరిగానే ఇప్పటికే స్పందించారు. 


అసలు నిధులు ఇచ్చినవారు అడిగితే, అది ఎవరిసొమ్మైనా, నిధులు తీసుకున్న వారు లెక్కలు చెప్పవలసిందే. ఋణదాత కానివ్వండి, సహాయం చేసినవారు కానివ్వండి, చందా ఇచ్చిన వారుకానివ్వండి, తాము సరపరా చేసిన  (సరపరా ఎందుకనవలసి వచ్చిందంటే ఈ సొమ్ము నరెంద్ర మోడీదా సొమ్మా? కేంద్రం సొంత సొమ్మా? అని మాట్లాడే విద్యా ఙ్జానశూన్యులకు ఎలా సమాధానం చెప్పాలో అర్ధం కాక అలా చెప్పవలసి వచ్చింది) సొమ్ములు నిధులు ఏలా వినియోగమయ్యాయని తెలుసుకోవటం సర పరా చేసిన వారి హక్కు. చివరకు ప్రజలు పన్నుల ద్వారా కట్టిన సొమ్మైనా సరే. ఇక్కడెవరూ ప్రజల సొమ్ము తప్ప తమ సొమ్ము పైసా కూడా ఖర్చుపెట్టరనేది పొత్తిళ్ళ లోని పసిపాపాయికి కూడా తెలుసు. 

ఉదాహరణకు మన గృహనిర్మాణానికి బాంక్ నుండి ఋణం తీసుకుంటే "ఎండ్ యూజ్ లేదా వినియోగ వివరాల దృవపత్రం" సమర్పిస్తేనే మలి విడత ఋణ విడుదల చేస్తారు. "ఈ లాజిక్ జేపి ఎలా మిస్ అయ్యారా?"  అని జనం ముక్కుపై వేలేసుకుంటున్నారు. రాష్ట్రం పైనో?  రాష్ట్రాధినేత పైనో? ప్రత్యేకమైన అభిమానం కళ్ళకు అంధ కారంలా కమ్మినప్పుడు న్యాయం మాట్లాడవస్తే "తీర్పు" ఇలాగే ఉంటుంది. అందుకే న్యాయమూర్తులకు ప్రేమ అభిమానం లాంటి అంధకారాలు ఉండకూడదంటారు. 

అంతేకాదు ఇచ్చిన నిధులు ఏ అవసరం కోసం ఇచ్చారో?  ఆ అవసరానికే వాడబడ్డాయా? లేదా వేరే పథకానికి వినియోగించారా? దారిమళ్ళించారా? అని కూడా  విచా రించి తెలుసుకోవచ్చు. ఉదాహరణకు పోలవరం ప్రోజెక్ట్ కు అందించిన నిధులు పట్టిసీమకు వాడితే అది 100% తప్పు.

అలాగే వెనుకబడిన జిల్లాల అభివృద్ధికై  నిర్దేసించి ఇచ్చిన నిధులు శంకుస్థాపనలకు ప్రమాణ స్వీకారాలను వైభోగంగా నిర్వహించటానికి వాడితే అది నేరం.

అలాగే ఒక కెంద్ర పథకం అమలుకు అంద జేసిన నిధులు దాన్ని దారిమళ్ళించి రాష్ట్ర ప్రభుత్వ (అధినేత) పేరిట ఈ మధ్య చలామణి ఔతున్న పథాకాలకు వాడితే అది మరింత ధౌర్భాగ్యం.

ఇదతా జేఎఫ్సి నిర్ధారించిన నాడే మనం దోషిని ప్రజలముందు నిలబెట్టగలం. లేకపోతే  "జేఎఫ్సి" లో ఉన్న ప్రతినిధులో, సభ్యులో,  పవన్ కళ్యాన్ నటనను మాయను గుడ్డిగా నమ్మి ఓటేస్తే  "తెలుగుదేశం డ్రామా ప్రోజెక్ట్" లో తమకు తెలియకుండానే భాగస్వాములై పలుచనవుతారని మనవి.



ఇక్కడ టిడిపిలో నైతికత ఉందా? కేంద్రంలో నైతికత ఉందా? ఐతే వీరు అలా ప్రవర్తించటానికి కారణం ఏమిటి?  నిధులు దారిమళ్ళి నాయకుల కొంపలకు చేరాయా? వారి స్వంత బొక్కసాలు నింపుకున్నారా?  పథకాల బ్రాండింగ్ సంగతేమిటి? అసలు అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోను పథకాలకు అధినేత పేరిట చేసే బ్రాండింగ్ లకు అయ్యే ఖర్చు శంకుస్థాపనలకు రాజధాని కోసం పలుదేశాలు మందిమార్భలంతో తిరిగినప్పుడు చేసిన వ్యయాలు వీటన్నిటి దూబారా వివరాలు ప్రజలకు తెలి యాలి  అది తేల్చకపోతే వివరాలను మసిబూసి మారేడు కాయ చేస్తే మాత్రం "జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ"  కాస్తా  "జాయింట్ ఫ్రాడ్ ఫాల్స్ నిమజ్జన కమిటీ"  అని జనం సంభోదిస్తా రని మనవి.

ఎప్పుడూ కూడా నిజనిర్ధారణ చేసే వారు వేరే ఎవరికి చివరకు అధికారపార్టీలకు కొమ్ముకాయకూడదు. అలాంటి అనుమానం శంక కూడా ప్రజలకు కలగకుండా చూసు కోవాలి.  ఇది జనహృదయం మిస్టర్ పవన్. పరువు పోగొట్టుకోకు. ఈ అనుమానానికి కారణం "జెపి గారి ఉవాచ"  బహుశ కొద్దిగా అర్ధమయ్యాక ఉండవల్లి ఈ కమిటీ నుండి తప్పుకునే అవకాశాలున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: