శబాష్ సింగపూర్! ప్రజలకు బోనస్ యివ్వటం అద్భుతం

ప్రపంచంలో సాధారణంగా ఉద్యోగులకు లేకపోతే చట్టసభల్లో పౌరప్రతినిధులకు సాధారణంగా పండగలకో, ముఖ్యమైన సందర్భాలకో, కంపనీలు అధిక ఆదాయాన్ని సమకూర్చుకున్నప్పుడు బోనస్‌లు ఇస్తుంటారు. ప్రజలకు మాత్రం ఇంతవరకు ఏదేశం బోనస్ ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు. ఐతే సింగపూర్‌ ప్రభుత్వం మాత్రం తమ పౌరులకు ఈ సంవత్సరం బోనస్ ప్రకటించింది. 


21 ఏళ్లు పైబడ్డ సింగపూర్‌ పౌరులందరికీ మిగులు బడ్జెట్‌ తో బోనస్‌ ఇస్తున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి 'హెంగ్‌ సీ కీట్‌' సోమవారం ప్రకటించారు. 2017 బడ్జెట్‌లో దాదాపు  10 బిలియన్ల సింగపూర్‌ డాలర్లు (7.6 బిలియన్‌ అమెరికా డాలర్లు) బడ్జెట్‌లో మిగిలిందని దాన్ని ప్రజలకు పంచాలని వారికి బోనస్ ప్రకటించారు. ఈ విషయాన్ని హెంగ్‌ తాజా బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. సింగపూర్‌ అభివృద్ధి ఫలాలను సింగపూర్‌ వాసులతో పంచుకోవాలనే ఉద్దేశం తోనే తాము ఈ బోనస్‌ ఇస్తున్నట్లు తెలిపారు.

Heng Swee Keat finace minister of Singapore

ఈ బోనస్‌ తో ప్రభుత్వానికి 700 మిలియన్ల సింగపూర్‌ డాలర్లు ఖర్చవుతుందని తెలిపారు. బోనస్‌లను ఉద్యోగుల జీతాల ఆధారంగా చెల్లిస్తారు. అదే విధంగా ఈ బోనస్‌  ను కూడా ప్రజల ఆదాయ లేదా వేతనం ఆధారంగా స్లాబులు ఏర్పరచి అందిస్తున్నట్లు ప్రకతించారు.


*28 వేల సింగపూర్‌ డాలర్లు, అంత కంటే తక్కువ వేతనం ఉన్న వారికి 300సింగపూర్‌ డాలర్లు(సుమారు రూ.14,700) బోనస్‌గా వస్తుంది. 

*28వేల నుంచి లక్ష సింగపూర్‌ డాలర్ల జీతం ఉన్న వారికి 200 సింగపూర్‌ డాలర్లు (సుమారు రూ.9,800) బోనస్‌ లభిస్తుంది. 

*లక్ష సింగపూర్‌ డాలర్ల కంటే ఎక్కువ జీతం ఉన్న వారికి 100 సింగపూర్‌ డాలర్ల (సుమారు రూ.4,900) బోనస్‌ ఇస్తారు. 

గత బడ్జెట్‌లో మొత్తం 9.61 బిలియన్ల సింగపూర్‌ డాలర్లు మిగలగా అందులో బోనస్‌లతో పాటు మరికొన్ని పనులకూ ఉపయోగించనున్నారు. సుమారు 5 బిలియన్ల సింగపూర్‌ డాలర్లను రైల్వేలో మౌలిక సదుపాయాల కోసం కేటాయించగా, మరో 2బిలియన్ల సింగపూర్‌ డాలర్లను ప్రీమియం సబ్సిడీల కోసం, వయోవృద్ధుల ప్రయోజనాల కోసం, బీమా పథకాల కోసం ఉపయోగించడానికి కేటాయించారు.


అదే మనదేశంలో ఐతే రాష్ట్రపతి నుండి ఎమెల్యే వరకు వేతనాల పెంపు రూపంలో దండు కుంటారు. నల్లధనం విదేశాలనుండి రప్పించి ప్రజల ఒక్కొక్క ఖాతాలో ₹ 15 లక్షలు జమ చేస్తానన్న ప్రధాని మాట నీటి మూటే అయింది.   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: