జగన్ కు, చంద్ర బాబు కు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్...!

Prathap Kaluva
పవన్ కళ్యాణ్ పూర్తి గా సినిమా లను వదిలేసి ఇప్పుడిప్పుడే రియల్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడని అనుకోవచ్చు. అయితే జగన్ మొహన్ రెడ్డి నిన్న పవన్ కళ్యాణ్ కు సవాలు విసిరిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే ఆ సవాలును స్వీకరిస్తున్నానంటు, ప్రెస్ మీట్ లో చెప్పాడు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీ సిద్ధం అని ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ఆయన చేసిన కామెంట్స్ కి అధికార పక్షం అయిన టిడిపి నుంచి ఎలాంటి కామెంట్స్ రాకపోయినా, జెఎఫ్ సీ పేరుతో ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్.. జగన్ మోహన్ రెడ్డికి పూర్తి మద్దతు ఉంటుందని, ముందు వైసీపీ వారు సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని, అప్పుడు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. అలాగే టిడిపి వారు కూడా అదే పని చేయాలని, ప్రజల కోసం ఎవరు పోరాడినా వారికి తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి నిన్న తెగేసి మరీ అవిశ్వాసానికి తాము సిద్దం అని సవాలు విసరడంతో తానూ ఆ సవాలును స్వీకరిస్తునట్టు తెలిపారు. 

ఒక్క ఎంపీ తో కూడా అవిశ్వాసాన్ని ప్రవేశ పెట్టవచ్చు అని అన్నారు. అందుకు కావలాసిన పూర్తి మద్దతును తానూ కూడా గడతానని ఆయన తెలిపాడు. ఇంకా పవన్ ఏం చెప్పాడంటే, ప్రకాశం జిల్లాలో వైస్సార్సిపి  నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం పెడతాను దానికి మీరు సపోర్ట్ చేయండి అని నాకు ఛాలెంజ్ విసిరారు. దాని గురించి స్పందించడానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. "అవిశ్వాస తీర్మానం పెట్టడానికి మద్దతు కావాలన్న జగన్మోహన్ రెడ్డి గారి సవాల్ ని నేను స్వీకరిస్తున్నాను.  అవిశ్వాస తీర్మానానికి నా పూర్తి మద్దతు ఇస్తాను కానీ తీర్మానాన్ని ముందు వైస్సార్సిపి  ఎంపీలు ప్రవేశ పెట్టండి ఆ తర్వాత నేను దేశంలోని ఇతర పార్టీల మద్దతు ఖచ్చితంగా కూడగడతాను.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: