ఎడిటోరియల్: ఉండవల్లి అపరచాణక్యుడు ఒక దెబ్బకు అన్నీ పిట్టలు వల్లో పడ్డాయి!




నిర్ధాక్షిణ్యంగా తమ ఎన్నికల స్వార్ధ ప్రయోజనం కోసం:


-పచ్చటి తెలుగు రాష్ట్రాన్ని  నిట్టనిలువున ఆడ్దదిడ్డంగా కోసిపారేసి  విభజించిన కాంగ్రెస్ 

-దానికి సమిదలు చేర్చి అగ్ని రగిల్చి ప్రత్యేక ప్రతిపత్తి కోరిన బాజపా

- రెండువరాలు ఇస్తానన్న పార్లమెంటును మూడువరాలు కోరి కైమాక్సులో జావ కారిపోయిన టిడిపి

- తన పార్టీ ప్రజా ప్రతినిధులనే నిలుపుకోలేక తనమునకలౌతున్నవైసిపి

- నేను ప్రశ్నిస్తా? నేను ప్రశ్నిస్తా? అంటూ, జనసే అధినేతకు అసలు ప్రశ్నించే ధమ్మేలేక, టిడిపి చేతిలో పావుగా మారి తెరపై టిడిపి చెప్పినట్లు చిందులేసే పవన్ కళ్యాణ్ ను, అదృశ్య నేపధ్యంలో ఉండి చతురత తో రాష్ట్రప్రయోజనాల సాధన కోసం దారిమళ్ళించి, తనదైన చాణక్య వ్యూహంతో, "అందరూ తన దారిలో నడిచేలా చేసుకొని "కౌటిల్యం" ప్రదర్శించిన ఉండవల్లి అనితర సాధ్యుడు. చాణక్యుడు అన్నదానికి అచ్చమైన ఉదాహరణగా ఈయన్ని చెప్పోచ్చు. ఇంకెవరూ ఇప్పటి రాజకీయాల్లో వ్యూహరచనకు ఉండవల్లికి సాటిరాలేరు. దరిదాపుల్లోకి కూడా రాలేరు"  


స్వార్ధరాజక్రీయాలకు వ్యూహం పన్నేవాణ్ని రాక్షసుడు  అంటారు. ప్రజాప్రయోజనాలే సుధీర్ఘ లక్ష్యం చేసుకొని చెసేది మాత్రమే చాణక్యం అంటారు అలాంటి వ్యక్తిని మాత్రమే చాణక్యుడు  అనాలి. దుర్మార్గ పన్నాగాలు చాణక్యం కానేరవు ఎప్పటికి కూడా! 

రాక్షసుడు  నందరాజ్య ప్రధాన మంత్రి . అద్భుతరాజకీయ వ్యూహ చతురుడు. స్వార్ధపరుడు


”పవన్ కళ్యాణ్ ఎందుకింత ఆయాస పడుతున్నారో అర్థం కావడం లేదు"  జేఏసీ ఏర్పాటు చేస్తున్నామని తనని ఆహ్వానించిన సినీనటుడు పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు అందుకుని నిస్వార్ధంగా  మరుసటి రోజే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్న మాటలివి. ఆయన లోని స్పష్టత, లక్ష్యంపై  గురి ప్రాధమ్యాలుగా నడిచే ముందస్తు ఆలోచన, ముక్కు సూటి తనం, ఋజువర్తన, పదునైన బాష సూటిగా 'ఐ కాంటాక్ట్' మార్చకుండా నిశ్చలంగా వుంటాయో చెప్పడానికి ఈ ఒక్క ముక్కచాలు.

రాజకీయ అవసరాలకు బెదరని చెదరని పోకడలు, ఉత్తుత్తి ఆరోపణ లకు చోటు ఇవ్వని "సాధికారత" ఆయన శ్వాస గా కనిపిస్తుంది చూసేవాళ్లకు. అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఉండే ఋజువర్తన ఉండవల్లి లో ఉందని చెప్పవచ్చు. హిమాలయాలంతటి రామోజీరావు ను "ఢీ" అంటూ సిద్ధమైనప్పుడు ఈయనేం తట్టుకోగలడ నుకున్నాం. కాని ఆ స్థిరత్వం తెచ్చుకుంటే వచ్చేదికాదు. అసలు లోపల ఉంటేనే లభించేది.

 

కొన్నాళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ కు "ప్రత్యేక హోదా" అంటూ చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం, ఇప్పుడు అకస్మాత్తుగా ఒక శిఖరానికి చేరి రసవత్తర స్థాయిని అందు కుందని చెప్పవచ్చు. అందరూ వారివారి ఆట ఆడుతుంటే - అందరి ఆటలను క్రాస్-రోడ్స్ తనవద్దకు తెచ్చుకున్నారు ఉండవల్లి. కనపడని చెయ్యేదో నడుపుతుంది నాటం కనిపించి నువ్వూ నేను ఆడదాము భూటకం అన్నట్లు....అందులో వెనుకుండి నడిపించిన చెయ్యి ఉండవల్లి అరుణ్ కుమార్ అని బలంగా చెప్పొచ్చు.


"మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం" అనే కాన్సెప్ట్ కు జన్మప్రధాత ఉండవల్లి. పదుల సంఖ్యలో ఆయన వీడియోలు యూట్యూబ్ లో దొరుకుతాయి. కాకపోతే ఆయనకు చేతకాని  "క్రౌడ్ పుల్లింగ్ నైపుణ్యం - జనాకర్షణ"  పవన్ కళ్యాణ్ కు ఉంది. ఇప్పుడు చతురత, వ్యూహం, చాణక్యం ఉండవల్లి దైతే పవన్ కళ్యాణ్ తెరపై ఆడితే సరి పోతుంది. చాణక్య చంద్ర గుప్తులౌతారు ఇద్దరూ కలిస్తే.


కాని పవన్ కళ్యాణ్ లో ఆ స్థిరత్వం ప్రశ్నార్ధకం. ఆయన ఔటర్ ఆర్బిట్ లోని ఎలెక్ట్రాన్. ఏ రసాయన చర్యకో గురై చంద్ర బాబో !మోడీ !వ్యూహంలో పడకుండా ఉంటే ఇక రాజకీయం రసకందాయం. ప్రజా ప్రయోజనపథంలో పడటం ఖచ్చితం. 

జనసేన ప్రతిపాదిత "జేఎఫ్ఎఫ్ సి"  సమావేశం రెండో రోజు ఉండవల్లి లేవనెత్తిన ప్రపోజల్ "మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం"  అంతకుముందు ఏ ఒక్కరికీ రాని ఆలోచన కూడా ఇదే. సంపూర్ణ మెజారిటీని ఎంజాయ్ చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పెట్టినంత మాత్రాన ఈ  అవిశ్వాస తీర్మానం పిపీలికం  ఏమాత్రం  ఇబ్బంది పెట్టలేదన్నది నిర్వివాదాంశం!  కానీ, ఇచ్చిన హామీలను గట్టిగా కుట్టి కుట్టి నొప్పెట్టి గుర్తుచేయగల గాయం చెయ్యగలదు ఒక చిన్న చలిచీమ అదే పిపీలికం. 


ఏపీ అవసరాల్ని గుర్తెరిగి మసలుకోవాలన్న బాధ్యతను బీజేపీ ఫీలయ్యేలా చేయాలంటే, "చీమ బైట్ అంటే చీమ కాటు సలపరం"  పెడుతూ కొంత సేపైనా గుర్తుచేస్తుంది. ఈ  "అవిశ్వాసం" ఒక్కటే సరైన మార్గ మన్నది తొలినుండీ ఉండవల్లి భావన వాదన. అది నూరు శాతం నిజం. మంటెత్తినా నోరు తెరవలేని చురుకు సరిగ్గా,  "తేలు కుట్టిన దొంగ" పరిస్థితిని మోడి ఎదుర్కోవటం ఖాయం. ఆయన్ని ఆయన నోటి తోనే నమో! అనిపించగలదు ఈ  "అవిశ్వాసం" 

 

ఇప్పటికే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వైసిపి చేపట్టిన హుందాతో కూడిన నిరసన, టిడిపి వాళ్ళు మద్దతిచ్చి చేసిన అర్ధనగ్న ప్రదర్శన మన తెలుగువాళ్లని డిల్లీ నడి వీధుల్లో పలుచన చేసినా ఈ  ఈ యాగీకి  అల్లరికి నరెంద్ర మోదీ ప్రభుత్వ ప్రతిష్ట మీద పెంటపడి కొంత మసకబారింది. ఆ రాజకీయ వత్తిడిని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్ళాలంటే  "అవిశ్వాస ప్రకటన"  అవసరమని గుర్తెరిగి - చంద్రబాబుని పవన్ ను కాసేపైనా దూరంపెట్టి   జగన్మోహన రెడ్ది "అవిశ్వాసం చాలెంజ్" ను పవన్ కళ్యాణ్ చేత స్వీకరించేలాగా ప్రతిసవాల్ చేయించారు. జగన్ సవాల్-పవన్ ప్రతి సవాల్ టైమింగ్ అద్భుతః . ఈ అవిశ్వాస ప్రకటన ఘట్టాన్ని శిఖరాగ్రస్థాయి కి  (పచ్చిగా చెప్పాలంటే ఆర్గాజం స్థితికి) చేర్చింది. .....హాట్స్ ఆఫ్ ఉండవల్లి..జీ.. 


దీనికి ఉండవల్లి ఎంచుకున్న "టైమింగ్" చాలా బాగుంది. అదే చంద్రబాబు నిర్ధేశకత్వంలో ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ చేసి ఉండేవారు కాదు. అందుకే ఉండవల్లి ఆయన్ని బలహీనక్షణంలోకి నేట్టేసి జగన్ సవాల్ ను స్వీకరించేలాగా చేయటం ఒక విజయం. ఇక పవన్ కళ్యాణ్ ఎవరి రాజకీయ ప్రలోభంలో పడ్డా "జనంలో ఆయన రాజకీయ జీవనం చరమాంకమే" దట్స్ ఇట్.. దీనికి వైసీపీ అధినేత జగన్ సైతం మద్దతు పలుకుతూ స్పందించారు. నరెంద్ర మోదీ సర్కారు మీద తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం ప్రతిపాదిస్తే  మద్దతివ్వడానికి మా ఎంపీలు సిద్ధంగా ఉన్నారంటూ బహిరంగ ప్రకటనే చేసేశారు.


కానీ, కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టాలంటే పార్లమెంట్ సభ్యుల్లో  పది శాతం మంది మద్దతు ఉండాల్సిందే. అంటే 54 మంది ఎంపీ లని కూడదీసుకుంటే తప్ప, ఈ  "మోషన్"  లోక్ సభ లో "మూవ్"  చేసే వీలుండదు. ఏపీ లోని రెండు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన 25 మంది ఎంపీ ల ప్రాతినిధ్యం మాత్రమే ఉంది. ఇప్పుడు తక్కువబడ్డ 29 మంది ఇతర ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులని ఒప్పించాలి. బీజేపీ లోనే పది మంది అసమ్మతి ఎంపీలున్నారన్నది ఒక తాజా గణాంకం. ఇక శివసేన, తృణమూల్, ఆమ్-ఆద్మీ లాంటి పార్టీలతో మాట్లాడుకుంటే, కావలసిన 54 మంది మద్దతు సునాయాసంగా దొరికే అవకాశం ఉంది.


కాని అదంత సామాన్యమైన విషయం కాదు. ఎవరి రాజకీయ అవసరాలు వారికుంటాయి. ముందు చంద్రబాబే ప్రధాన అడ్డంకిగా మారే ప్రమాదముంది. క్రెడిట్ పవన్ కళ్యాణ్ కు పోతే తాను ససేమిరా అంటాడు. అయినా నరెంద్ర మోడీ తో మైత్రి వదులుకోవటం ఆయన రాజకీయ జీవితానికే ప్రమాదం. బయట ఉండి ఎన్నైనా చేయించ గలరు కాని బరిలో ప్రత్యక్ష యుద్ధం చేయటం ఆయన తరం కాదు. ఆయనకు ఎన్ని ప్రతిబంధకాలున్నాయో ఆ బహగవంతునికి తప్ప ఎవరికి తెలియవు. అందునా నమో తో ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ.  కాని ఈ పరిస్థితుల్లో ఈ రాజకీయ మకిల ఇప్పటి వరకు అంటని పవన్ కళ్యాణ్ మాత్రమే చంద్రబాబు ప్రలోభానికి పడకుండా మోడీ  అనే  "పిల్లి మెళ్ళో గంట" కట్టగలరు.  


రాత్రి ఒక టివి చానల్ లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మద్దతు కూడగట్టటానికి నాయకత్వం వహిస్థానని చెప్పారు. దీన్ని పవన్ కళ్యాణ్ కంటే ఉండవల్లి ఐతేనే చక్కగా లీడ్ చేయగలరు. పవన్ కళ్యాణ్ కు ఆరంభ శూరత్వం తప్ప నాయకత్వం వహించి యఙ్జవిధి నిర్వహించగల సామర్ధ్యం ఉండవల్లి తోడుంటే సాధ్యమౌతుంది. ప్రజలంతా ఆయనకు ఇప్పటికే "బ్రాండ్ టిడిపి" అంటారు. ఈ "నోకాంఫిడెన్స్ మోషణ్" పార్టీ రహితంగా రావాలి. దాన్ని ఉండవల్లే చేయటం అవసరం. కావాలంటే పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తే మంచిదే.


(అసలు చంద్రబాబును అందరూ ప్రక్కకు తప్పిస్తే నరెంద్ర మోడీనే రాష్ట్రానికి ఏమైనా చేయగలడేమో? అఫ్కోర్స్ ఇది ప్రస్తుతానికి ఊహా జనితం మాత్రమే!)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: