రాయలసీమ ఉద్యమం రాబోతోంది మామూలు రచ్చ కాదు

KSK

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి పార్టీ పాతుకు పోవటానికి సరైన ప్రణాళికలు వేస్తోంది. ఉత్తర భారతదేశంలో బలంగా ఉన్న బిజెపి దక్షిణ భారతదేశంలో కూడా ముందుకు సాగాలనే నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో బీజేపీ పార్టీ క్రమక్రమంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక రాయలసీమ అనే కొత్త నినాదాన్ని భుజాన వేసుకుంది.. భారతీయ జనతా పార్టీ.


ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ ప్రత్యేక రాయలసీమ అనే నినాదం తెలుగురాష్ట్రాల రాజకీయాలలో చర్చనీయాంశమయింది. ఈ క్రమంలో సీమ ప్రాంతానికి చెందిన బిజెపి నాయకులు కర్నూలు వేదికగా ప్రత్యేక రాయలసీమ కావాలంటూ డిమాండ్ చేశారు...అంతే కాకుండా రాయలసీమ లో రాష్ట్రానికి సంబంధించి రెండో రాజధాని నిర్మించాలని..అలాగే హైకోర్టు కూడా రాయలసీమలో నిర్మించాలని అన్నారు.. రాయలసీమ బిజెపి నాయకులు.


మరియు అదే విధంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయాలని...నాలుగూ జిల్లాల రాయలసీమను ఎనిమిది జిల్లాలుగా చేయాలనీ ఇది తమ డిమాండ్ అని స్పష్టంగా చెప్పారు రాయలసీమ బిజెపి నాయకులు. 


నిన్న‌టివ‌ర‌కూ రాయ‌ల‌సీమ వాడిన‌నే మ‌రిచిపోయి..కాషాయ కండువా వేసుకుని జై మోడీ అంటూ టీవీ చ‌ర్చ‌ల్లో ఊగిపోయిన విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి అత్య‌వ‌స‌రంగా రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించారు. ఈ మొత్తం చూస్తున్న రాజకీయ విశ్లేషకులు విభజించు పాలించు నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ ని అనుసరిస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: