దాదాపు ప్రభుత్వ బాంకులన్నింటిలోనూ ఋణాల ఎగవేతల సీజనే నడుస్తుంది - జబితాలో మరికొన్ని బాంకులు?

దాదాపు ప్రభుత్వ బాంకులన్నింటిలోనూ ఋణాల ఎగవేతల సీజనే నడుస్తుంది-జబితాలో మరికొన్ని బాంకులు?  ప్రఖ్యాత వ్యాపార వర్గాలు భారతీయ బాంకింగ్ వ్యవస్థ ను నిలువునా ముంచెయ్యటానికి రంగం సిద్ధం చేసుకున్నారన్నట్లుంది భారత దేశంలో ఆర్ధిక వాతావరణం. 

వజ్రాల వ్యాపారీ నీరవ్‌ మోడీ (పిఎంబి)
రొటోమోక్‌ అధినేత విక్రమ్‌ కొఠారీ, (బాంక్ ఆఫ్ ఇండియా) 
సింబోలి షుగర్స్‌ ఛైర్మన్‌ గుర్మిత్‌-సింగ్‌-మన్‌ (ఓబిసి)

(సింబోలి షుగర్స్‌ కంపనీలో ఉన్నత స్థానాల్లో ఉన్న "గుర్పాల్ సింగ్"  పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అల్లుడు అని గమనించాలి)


మన బ్యాంకులను వరుసగా ముంచిన వైనం మర్చిపోక ముందే ఇదే వరసలో మరో రెండు కంపెనీలు వచ్చి చేరాయి. లేని ఆస్తులు, ఆదాయాలు చూపించి భారీ మొత్తంలో రుణాలు పొంది ఆ తర్వాత చెల్లించకుండా పోతున్నాయి. 


ఆర్‌పి ఇన్ఫోసిస్టమ్స్‌ 10 బ్యాంకులకు రూ.500 కోట్ల పైగా ఎగనామం (కెనరా బాంక్) 
శ్రీలక్ష్మీ కొట్సిన్‌ లిమిటెడ్‌ రూ.4,000 కోట్లు ఎగేసుకుపోయింద (సెంట్రల్ బాంక్) 

ఈ రెండు కంపెనీలు బ్యాంకులను భారీగా మోసం చేశాయని కొత్తగా బుధవారం వెల్లడయ్యింది. ఇందులో ఆర్‌పి ఇన్ఫోసిస్టమ్స్‌ కంపెనీ డైరెక్టర్‌ శివాజీ పంజా ఏకంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారని వార్తలు వస్తున్నాయి. కోల్‌కతా కేంద్రంగా పని చేస్తున్న ఆర్‌పి ఇన్ఫోసిస్టమ్స్‌, దాని డైరెక్టర్లు ₹515.15 కోట్లకు పది బ్యాంకులను మోసం చేసినట్లు కేసు నమోదైంది.

కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలోని 10 బ్యాంకుల కన్సార్టియం నిన్న సిబిఐకి ఫిర్యాదు చేసింది. ఆ కంపెనీ డైరెక్టర్లు శివాజీ పంజా, కౌస్తువ్‌ రే, వినరు బఫ్నా, వైస్‌ ప్రెసిడెంట్‌ దేబాంత్‌ పాల్‌, కొందరు బ్యాంకు అధికారులపై సిబిఐ కేసు నమోదు చేసింది. సెక్షన్‌ 120బి రెడ్‌-విత్‌ 420 కింద నేరపూరిత కుట్ర, 468, 471 కింద ఫోర్జరీ, ప్రభుత్వ ఉద్యోగు ల నేరపూరిత ప్రవర్తల కింద కేసులు పెట్టింది. 

2015లో ఇదే కంపెనీ ఐడిబిఐ బ్యాంకును కూడా మోసం చేసిన దరిమిలా ఆ కంపెనీపై కేసు అప్పుడే నమోదయ్యింది. తాజాగా కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలోని 10 బ్యాంకు ల కన్సార్టియం సిబిఐని ఆశ్రయించింది. ఈ కన్సార్షియంలో మోసపోయిన బ్యాంకుల్లో పిఎన్‌బి కూడా ఉంది. దీంతో పాటు ఎస్‌బిఐ, యుబిఐ, అలహాబాద్‌ బ్యాంక్‌, ఒబిసి, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఫెడరల్‌ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి.


ఆర్‌పి ఇన్ఫోసిస్టమ్స్‌ 2012లో వివిధ బ్యాంకుల వద్ద లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌ఒయు) పొంది, వీటితో వివిధ బ్యాంకుల నుంచి భారీగా ఋణాలు పొందింది. అయితే తిరిగి బ్యాంకులకు ఆ మొత్తాన్ని చెల్లించలేదు. బ్యాంకుల నుంచి రుణాలను పొందేందుకు గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌, విన్సెంట్‌ ఎలక్ట్రానిక్స్‌, సియాట్‌ లిమిటెడ్‌ తదితర కంపెనీలో వ్యాపారాలు కలిగి ఉన్నట్లు ఆర్‌పి ఇన్ఫోసిస్టమ్స్‌ దొంగ పత్రాలను, ఆదాయాలను సృష్టించింది. కాగా 2015లోనే ఈ మోసం బయట పడింది. 

ఆర్‌పి ఇన్ఫోసిస్టమ్స్‌ డైరెక్టర్‌ శివాజీ పంజాతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి తో కలిసి ఆయన విదేశాల్లోనూ పర్యటనలు చేశారు. ప్రభుత్వానికి చెందిన పలు కమిటీల్లోనూ శివాజి పంజా ప్రముఖులుగా ఉన్నారు. మమతాతో కలసి అతిథి హోదాలో శివాజి పంజా ఢాకా పర్యటనకు వెళ్లి వస్తుండగా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర పోలీసులే ఆయన్ను వివిధ ఆర్ధిక నేరాల క్రింద అరెస్టు చేశారు. అనంతరం ఆయనకు ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో బయటపడ్డారని అప్పుడే వార్తలు వచ్చాయి.   

కౌస్తువ్‌ రే , ఆర్‌పి ఇన్ఫోసిస్టమ్స్‌ 

ఇక కాన్పూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న వస్త్రాల తయారీ కంపెనీ శ్రీ లక్ష్మీ కొట్సిన్‌ దాదాపు 16 బ్యాంకులకు ₹3,972 కోట్ల మేర ఋణాలకు పంగనామం పెట్టింది. ఈ కంపెనీ ఆస్తుల విలువ మొత్తం ₹1500 కోట్ల లోపే ఉన్నాయి అప్పులుమాత్రం ₹4000 కోట్లున్నాయని అంటున్నారు. సెంట్రల్‌ బ్యాంకు నాయకత్వంలోని బాంకుల కన్సార్టియం  16 బ్యాంకు లు ఋణదాతలుగా ఉన్నారని "న్యూస్‌18" కథనం. ఈ కంపెనీ గ్రూప్‌ ఛైర్మన్‌ ఎంపి అగర్వాల్‌.  ఋణ ఎగవేత కారణంగా కంపెనీ ఆస్తుల వేలానికి అధికారులు సిద్దం అయ్యారు. అయితే కంపెనీ దీర్ఘకాలం ఋణాల కింద ₹2,406కోట్లు, స్వల్పకాల  ఋణాల్ కింద మరో ₹.937కోట్లు ఉన్నట్లు సమాచారం. ఆస్తులు అప్పుల అంతరం అగమ్య గోచరంగా ఉండటంతో అధికారులు బిత్తరపోతున్నారు.

Vikram Kothari Rotomac

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: