నిధులు రాబట్టడం కోసం బాబు కొత్త స్కెచ్

KSK

కేంద్ర మంత్రివర్గంలో నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మలు కాబోతున్న ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన నివాసంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలతో కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన నిధులు.. రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా చర్చించారు. ఈ క్రమంలో కేంద్రంపై ప్రత్యేక హోదా విభజన హామీలు విషయంలో వెనుకడుగు వేయకుండా మరోపక్క రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయంలో కూడా  వెనకడుగు వేయకుండా ఎలాగా కేంద్రంతో వ్యవహరించాలి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు దారితీశాయి.


ఉపాధి హామీ వంటి పథకాల్లో బకాయిల కారణంగా పేద కూలీలు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావనలో ఉంది. ఉపాధి హామీ బకాయిలకు రాష్ట్ర నిధుల నుంచే చెల్లింపులు జరపాలని ఇప్పటికే దానికి కావాల్సిన నిర్ణయం తీసుకుంది.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపాధి హామీ తరహాలోనే మరొక కార్యక్రమం చేపట్టి కేంద్రం నుండి నిధులు రాబట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల విషయంలో లెక్కలు చెప్పలేకపోయాం. అయితే కొత్తగా ఈ కార్యక్రమం మొదలుపెడితే కేంద్రం ప్రోత్సహిస్తుందా అని ప్రశ్నించారు చంద్రబాబునాయుడిని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: