మొదటి సారిగా జగన్ ముందు చంద్ర బాబు వ్యూహాలు పని చేయలేదు..!

Prathap Kaluva
చంద్ర బాబు నాయుడు ను రాజకీయాల్లో అపార మేధావి అంటారు. ఎన్టీఆర్ నుంచి పార్టీ ని లాక్కొని వెన్నుపోటు ను పొడిచిన ఉదంతాన్ని చూస్తేనే అందరికి అర్ధం అతని రాజకీయం, ఇంకా చెప్పాలంటే అతని కుతంత్రాలు ఏ విధంగా సాగించాడా అని అయితే ఇప్పుడు రాజ్య సభ సీటు విషయం లో కుడా ప్రతి పక్ష పార్టీ నేతలను కోని మూడో సీటు కూడా దక్కించుకుందాము అని ప్లాన్ వేశాడు. 

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని పప్పులు ఉడక లేదు. పైకి నీతులు చెబుతూ.. మరోవైపు పచ్చకండువాలు వేయడం కొనసాగుతూ వచ్చింది. మరి ఇంత చేసిన బాబుకు.. రాజ్యసభ సీటుకు మూడో అభ్యర్థిని పెట్టడం. మరికొంతమంది వైకాపా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టుకుని తన అభ్యర్థిని గెలిపించుకోవడం పెద్ద కథేం కాదు! బాబు ట్రాక్ రికార్డు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

అయితే.. బాబు రాజకీయం ఈ సారి ఓడింది. దీనికి రీజన్లు చాలానే అగుపిస్తున్నాయి. ఒకటి ఇప్పుడు రాజ్యసభ సీటు విషయంలో కెళికితే.. కేంద్రం సహకారం లేకపోవడం, ఢిల్లీలోని ఒక బీజేపీ ముఖ్యనేత వారించడం, ఆల్రెడీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో  సంప్రదింపులు జరిపితే వాళ్లు కాల్స్ ను రికార్డు చేసి అధిష్టానానికి ఇవ్వడం.. వంటి రీజన్లు.. ముఖ్యంగా టీడీపీ వైపు నుంచి వైకాపా ఎమ్మెల్యేలకు వెళ్లిన ఫోన్ల వాయిస్ రికార్డులే ఈ ఎన్నికల ఏకగ్రీవానికి కారణం అయ్యాయని టాక్. మొత్తాని చంద్ర బాబు మార్కు రాజకీయం ఓడింది. దీనిని ప్రజాస్వామ్యం లో ఒక మంచి రోజు గానే చెప్పవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: