బ్రేకింగ్: ఆధార్ కార్డ్ ఇప్పుడు దేనికి లింక్ చేయవల్సిన అవసరం లేదు: సుప్రీం కోర్ట్

ప్రస్తుతానికి ఆధార్ కార్డ్ బాంక్ అకౌంట్స్ కు గాని, మొబైల్స్ నంబర్స్ కు గాని, పాస్-పోర్ట్స్ కు గాని లేదా నిర్దేశించిన ఇతర సేవలకు విధించిన డెడ్-లైన్ 31.03.2018 వరకు లింక్ చేయవలసిన అవసరం లేదు. ఈ డెడ్-లైన్ "ఆధాకార్డ్ చట్టం చట్టపరమైనదా? కాదా?" అనేది తెలే అంతవరకు. ఈ బయోమెట్రిక్ గుర్తింపు ఎంతవరకు సురక్షిత మన్నది తెలవలసి ఉంది.


ప్రభుత్వం సంక్షేమ పథకాలకోసం తద్వారా లభించే సబ్సిడీలకోసం నిర్దేశించిన ఈ పథకాన్ని తరవాత అనేక ప్రభుత్వ ప్రైవేట్ మరియు వ్యక్తిగత పథకాలను విస్తరింప జేయటంతో - వ్యక్తిగత వివరాల రహస్యాల పరిరక్షణ - సంరక్షణ (ప్రైవసీ) చట్టం ఉనికి ప్రశ్నార్ధకమైంది. అయితే అది తేలేవరకు ఈ పన్నెండంకెల ఆధార్ కార్డ్ ను దేనికీ లింక్ చేయనవసరం తరవాత ఆదేశాలు వచ్చేంతవరకు లెదని తెలిసింది. 


లాయర్ వృందా గ్రోవర్ సుప్రీం కోర్ట్ లో చాలెంజ్ చేయటం తో ఈ ఘటన పై సుప్రీం విచారణ చేపట్టి ప్రస్తుతానికి "ఈ మద్యంతర ఉత్తర్వులు" ఇచ్చింది. సో, ప్రస్తుతానికి నో టెన్షన్.

 

మొబైల్స్ సేవల అనుసంధానానికి కూడా గడువు పెంపు వర్తిస్తుంది. తత్కాల్‌ పాస్‌పోర్టుల్ని పొందడానికి ఆధార్‌ను తప్పనిసరి చేయరాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

భారత ప్రభుత్వ సంచిత నిధి నుంచి ఖర్చు చేసే వివిధ పథకాల కింద ప్రయోజనాలను లబ్ధిదారులకు బదలా యించడానికి ఆధార్‌ సంఖ్యల్ని అడగడాన్ని ప్రభుత్వం కొనసాగించుకోవచ్చని అనుమతించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: