ఏపి జంపింగ్ జపాంగ్ ఎమెల్యేలకు హై కోర్ట్ షాక్ - మామూలుగా లేదు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ లోని ఉభయ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు షాకిచ్చింది. "ఆపరేషన్ ఆకర్ష్" ప్రజల్లో  చాలా ప్రచారం పొందిన పథకమిది. రాజకీయాల్లో పెను సంచలనానికి తావిచ్చిన ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కుటిల రాజకీయ తంత్రానికి ఒక ప్రత్యక్ష తార్కాణం. ఇదొక యాంటీ క్లయిమాక్స్. అంటే ఆసించిన దానికి రివర్స్ లో ఫలితం రావటమన్న మాట. 

వివరాలేమంటే: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైఎసార్సిపి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరారు. గత రెండున్నరేళ్ల నుంచి సాగిన ఈ "రాజ్యాంగ వస్త్రాపహరణం" పూర్తి వివాదాస్పదంగా మారింది. శాసన సభ సభ్యులు తామే నిర్దేశించుకున్న "ఫిరాయింపు చట్టాలు" తుంగ లో తొక్కటం తో ప్రభుత్వం శాసనసభ సభాపతి గౌరవం ప్రతిష్ఠ నైతికంగా మంటగలిసింది. ఈ దేశం లో రీ-కాల్ విధానం అమలులేదు కాబట్టి ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. అదే ఉంటే శంకరగిరి మాన్యాలు బట్టి పోయేదంటారు రాజనీటిఙ్జులు.  

హైకోర్టు నోటీసులు జారీ చేసిన ఫిరాయింపు మంత్రులు:  చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి, భూమా అఖిల ప్రియ,  రావు వెంకట సుజయకృష్ణ రంగారావు


నాడు ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పక్షంలోకి గోడ దూకిన ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. అయితే, తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీ పాదాల పంచన చేరినట్లు సిగ్గులేకుండా సమర్థించుకున్నారు. ఫిరాయించిన ప్రతిపక్ష శాసన సభ్యుల్లో నలుగురు మంత్రి పదవులు కూడా అధిస్థించారు.  ప్రజల్లోని ప్రజాస్వామ్య వాదులు కొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ ఉభయ రాహ్ట్రాల ఉమ్మడి న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం  (పిల్) దాఖలు చేశారు.

"రాజీనామా చేసి, వాటిని ఆమోదించుకున్న తర్వాత మాత్రమే పార్టీ మారితే అది చట్టబద్ధం" అంటూ విచారణకు యోగ్యత సాధించిన పిల్ మాత్రం గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు దాఖలు చేశారు. పరిశీలనానతరం దీన్ని విచారణకు స్వీకరించిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు, రాజీనామా చేయకుండా పార్టీ మారిన 22 మంది ఎమ్మెల్యేలకూ నోటీసులు జారీ చేసింది. ఇందులో నలుగురు ఎమెల్యేలు మంత్రి పదవులు కూడా పొందారు. వీరంతా నిర్ణీత గడువులోగా న్యాయ స్థానానికి తమ సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది.

ఇప్పుడు వీళ్లంతా "కింకర్తవ్యం దైవమాహ్నికం" అంటూ వారి రాజకీయ ప్రత్యక్ష దైవం దేశం, మొత్తం అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరికంటే ధీటైన నాలుగు దశాబ్ధాల సుధీర్గ రాజకీయ అనుభవమున్న వ్యూహాంగ ధురంధరుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి శరణు జొచ్చారు. అయితే ఈ సమస్య ఆయన గొంతు కే చుట్టుకుంటుందా - ఓటుకు నోటుకు ఇది జతకలిస్తే జరిగేది అదే అంటున్నారు రాజనీతి శాస్త్రఙ్జులు.

నైతికత, సెంటిమెంట్, అనుభవం, నిజాయతి, అవినీతిని సహించని పాలన, ఎన్నికల మానేజ్మెంట్, లాంటి ఒకదానికొకటి పొసగని విలువల గురించి ప్రచారకులకిది చావు దెబ్బే.  అయితే ఈ దెబ్బ తెలంగాణా కు కూడా తగిలే పరిస్థితులను కొట్టి పారేయలేం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: