ఎడిటోరియల్ : కేటీఆర్ కౌంటర్ ట్వీట్‌ ద్వారా చంద్రబాబుకు ఒక జీవితకాల పాఠం


భారత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదెశ్ కి ప్రత్యేక హోదా, వివిధ పధకాలకు నిధులు గురించి కొద్ది రోజుల క్రితం  చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్‌ ద్వారా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.


"కేంద్ర మంత్రి గారు ఒక మాట అన్నారు. సెంటి మెంట్‌కు డబ్బులు రావు" అని. కానీ ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి సెంటి మెంట్ కోసమే "తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు"  అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు.


అయితే దీనికి తెలంగాణ ఐటీ మంత్రి కలవకుంట్ల తారక రామారావు స్పందిస్తూ తన దైన ప్రత్యేక శైలిలో కౌంటర్ ఇచ్చారు.


"సర్! మాకు ఆత్మగౌరవం ఉంది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పుడూ వదులు కోలేదు. పోరాటాన్ని నీరుగార్చడానికి చాలా మంది ప్రయత్నించారు. ప్యాకేజీలు ఇస్తామని మభ్య పెట్టినా తీసుకోవడానికి సిద్ధపడలేదు.  అయితే మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి కానీ తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగాలను తక్కువచేసి మాట్లాడకండి" అంటూ రీట్వీట్ చేశాడు.


మరోవైపు నవ్యాంధ్రకు న్యాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు. సెంటిమెంట్ ఆధారంగా రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేమని, రాజ్యాంగబద్ధ సంస్థ ఆర్థికసంఘం సూచనల మేరకే ఆ పని చేస్తామన్న అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ఉటంకిస్తూ శాసనసభలో చంద్రబాబు బాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు.


"ప్రత్యేక హోదా ఐదేళ్ల పాటు ఇస్తామన్న హామీ తోనే పొత్తు పెట్టుకున్నాం. సెంటిమెంట్‌ తో తెలంగాణ ఇచ్చారు. 60 ఏళ్లు కష్టబడిన తర్వాత కట్టుబట్టలతో వచ్చిన వారికి సెంటిమెంట్‌ తో నిధులు ఇవ్వరా?" అంటూ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్ర బాబు నిలదీశారు.


ఇంత సొదకు బదులుగా ‘కెటిఆర్ ట్వీట్’ లోని విషయం అర్ధం చేసుకొని ఉంటే ఈ పాటికే ప్రత్యేక హోదా దక్కి ఉండేది.


ఏలా అంటే ఈ క్రింద వివరించిన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వినిపిస్తున్న ప్రజాభిప్రాయం చదవండి.

తెలంగాణా సమాజం తమకు ప్రత్యేక రాష్ట్రం తప్ప మరేది వద్దన్నారు. ప్రత్యేక పాకేజీ అనే ఆలోచనే తమకు లేదు అసలు తమకు ప్రత్యేక  రాష్ట్రం తప్ప మరేమీ వద్ధ న్నారు. మనసా, వాచా, కర్మణా తాము కోరుకుంది "ప్రత్యేక రాష్ట్రం" వినా మరేమీ కాదని, అదే తమ  శ్వాస ధ్యాస గా భావించారు.


మీరు కేంద్రాన్ని కోరి  మరీ, ఐదు కాదు పది, కాదు పదిహేను యేళ్ళ ప్రత్యేక హోదా అడిగారు. పదేళ్ల సమయం హైదరాబాదును రాజధానిగా తెలంగాణాతో పంచు కోవటానికి అంగీకరింప జేసు కున్నారు. మరేమైందో, హైదరాబాద్ ను వదిలేసి అర్ధాంతరంగా అమరావతికి రాజధాని తరలించారు. అలాగే శ్వాస ధ్యాసగా ఉండాల్సిన ప్రత్యేక హోదా లక్ష్యం లో ప్రత్యేక పాకేజిని దూర్చారు. మరి మీరెందుకు విజయం సాధిస్తారు.


మీకు ఏం కావాలో మీరు తేల్చుకోలేక పోయారు. మూడు యేళ్ళ తరవాత ప్రత్యేక పాకేజీ అని బేరం పెట్టారు. అదంతా మీరు కోరిందేనని అరుణ్ జైట్లీ నిర్మొహమాటంగా మీవాళ్లతోనే చెపితే మీ ప్రతినిధులు నోరు తెరవలేదు. అంటే మీరే ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక పాకేజీ కోరారనే అర్ధమౌతుంది. ప్రజలకు మీరైతే టొకరా ఇస్తారుగాని దాని నుండి వచ్చే దుష్పరిణామం బాజపా మీద లేదా ప్రతిపక్షం పై తొసేస్తారని అర్ధమౌతుంది. ప్రయోజనమైతే మీరు మీ నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవం తో సాధించారంటారు. అదే మిమ్మల్ని మీ ఆలోచనలను అనుసరించేవారికి అర్ధమౌతుంది.


తెలంగాణా సమాజానికి ఇలా ద్వైదీభావం, డొలాయమానం ఉండవు. కావాలంటే కావాలి! వద్ధంటే వద్దు. స్థిర నిశ్చయం స్థిత ప్రఙ్జత అక్కడ నిత్యం నిరూపణ అయ్యింది ఉద్యమ కాలంలో. బహుశ అన్నింటా ముందుండే మీరు వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వటం వలన ఆ సుగుణాలు కోల్పోయారనిపిస్తుంది.  బహుశ పరిణామ క్రమం లో తెలంగాణా సమాజం మీలాగే వృద్ధిలోకి రావచ్చనిపిస్తుంది.


అరవై సంవత్సరాలు కష్టపది అన్నీ వదిలేసి వచ్చారన్నారు. అయితే తెలంగాణా సమాజం ఆంధ్ర ప్రదేశ్ పెద్దలవలన నిరంతర దోపిడీకి గురైందని అంటుంది బల్లగుద్ది మరీ. మీరు కష్టపడింది మీ ఆస్తులు సంపదలు పెంచుకోవటానికే. హైదరాబాద్ లోని వాణిజ్య భవనాలు, వ్యాపారాలు, అన్నింటా గుత్తధిపత్యం ఇప్పటికీ మీవే. కాని ఆంధ్ర ప్రదెశ్ సాధారణ ప్రజలకు ఇంకా మీ నాయకత్వం నష్టం చేస్తూనే ఉంది.


గంటలు గంటలు ఉపన్యసిస్తే వచ్చేది కంఠశోషే తప్ప ప్రత్యేక హోదా మాత్రం కాదు. సుధీర్ఘ అనుభవం, సుధీర్ఘ మార్గాలు సాధించలేనిది,   సరైన మార్గంలో లక్ష్యం తప్పకుండా ప్రయత్నం చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు మీరు ఏ ప్రయత్నం చేసినా "చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్న చందమేనని" నని ప్రజలు అంటున్నారు. ఇంకొద్ది రోజులు పోతే తెలుగు దేశం పార్టీ ని నరెంద్ర మోడీ నే కాదు అసలు ఆంధ్రులే నమ్మరు. "నాయనా! పులి వచ్చే" అనే సామెత లాగా!! 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: