చంద్రబాబును ఆంధ్రులే నమ్మలేని పరిస్థితి - నరెంద్ర మోడీ నమ్మేది ఎలా? బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు నిండు శాసనసభలోలో కన్నీరు మున్నీరై విలపించారని వస్తున్న వార్తల పై వస్తోన్న వార్తా కథనాలపై  "వైఎస్సార్‌సీపీ" అత్యంత ఘాటుగా స్పందించింది.


"ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలకు, నాడు అదే అసెంబ్లీలో ప్యాకేజీ నిర్ణయాన్ని ఆహ్వానించిన సంగతి గుర్తులేదా!" అని పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కావాలని మొదటి నుంచీ పట్టు పట్టిన ప్రతిపక్షాన్ని సీఎం దబాయించిన వైనాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.


అందుకే బాబుని నమ్మరు: "మాట్లాడితే తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవమని చంద్రబాబు అంటారు. హైదరాబాద్‌ను కట్టిందీ తానేనంటారు. అప్పుడు కుతుబ్‌షాహీ ఆత్మ ఏం కావాలి? ఒక్క బిల్డింగ్‌ కడితే నగరాన్ని నిర్మించినట్లా? అప్పట్లో యునైటెడ్‌ ఫ్రంట్‌ అన్నారు, ఆ తర్వాత ఎన్డీఏ లో చేరారు, మోదీపై తీవ్ర విమర్శలు చేశారు, 2014లో మళ్లీ అదే మోదీతో జతకట్టారు. విభజన చట్టం ప్రకారం, పార్లమెంట్‌ హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా దక్కాలి. కానీ చంద్రబాబు ప్యాకేజీ తీసుకోడానికి రెడీ అయ్యారు.

ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవద్దన్న ప్రజలను, ప్రతిపక్షాన్ని అణిచివేశారు. తిరుపతి లడ్డూలు, శాలువాలతో కేంద్ర మంత్రులను సన్మానించారు. తీరా ఎన్నికలు దగ్గర పడేసరికి మళ్లీ ప్రత్యేక హోదా రాగం అందుకున్నారు. కేంద్రం చెప్పే లెక్కల కు, బాబు చెప్పే లెక్కలకు పొంతనే ఉండదు. కేంద్రం చేతిలో నుంచి పోలవరాన్ని ఎందుకు తీసు కున్నారో స్పష్టంగా చెప్పరు.

ఉమ్మడి రాజధానిపై 10 ఏళ్ల హక్కును వదులుకొని విజయవాడకు పరుగెత్తారు. ఆయన పల్టీలను దేశం మొత్తం చూస్తూనేఉంది. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరెంద్ర మోదీ టైమ్‌ ఇవ్వనిది ఇందుకేనేమో మరి! ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేయడం మానుకోవాలి" అని బుగ్గన అన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: