యూపీ నుండి ఏపీ వరకు బిజెపికి ఎదురుగాలి..!

ఉత్తరం దక్షిణం అనే కాదు మొత్తం భారత్ లో భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. ప్రజలు ప్రధాని నరెంద్ర మోడీని నమ్మి తమ ఓట్లను గంపగుత్తగా బాజపాకే వెసేశారు. ఈ నాలుగేళ్ళలో ప్రజావిశ్వాసం పటాపంచలైంది. అదే కేంద్రంలో అధికారం బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లలో మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీ అనూహ్యంగా ఓడిపోయింది. ఓటమి అనూహ్యం పెనుసంచలనం బీజేపీకి అనుకోని పరాజయం  పరాభవం! మోదీ గాలికి ఎదురు నిలబడటం కష్టమే కనుక, విపక్షాలు 2019 ఎన్నికల గురించి మరచిపోయి 2024ఎలక్షన్లపై దృష్టి కేంద్రీకరించాలన్న విశ్లేషణల నడుమ, ఎంతో కీలకమైన ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాల్లో మూడు లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగగా మూడు చోట్లా బీజేపీ మట్టికరచిన వర్ణనాతీతం. వైఫల్యం తీరు ఎన్నికల పండితులనే విస్మయ పరచింది. 

ఈ ఎనికల్లో కాంగ్రెస్ అనే జాతీయపార్టీ ఒకటుందనే విషయం జనం మరచిపోయారు. బాజపాని గడ్దికరిపించారు. ఇక 2019ఎన్నికలలో ప్రాంతీయ పార్టీల హావా - ప్రభంజనం లాగా మారే అవకాశాలు పుష్కలంగా ఉంది. బాజపా గెలిచినంత వేగంగా ఓడిపోనుంది.   


యూపీలో రెండు చోట్లా బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం - ఉప ఎన్నికలే కదా! అని తేలిగ్గా తీసిపారేయాల్సినంత చిన్న విషయమేమీ కాదిది. నితీశ్‌ కుమార్‌ బీజేపీతో జత కట్టాక బీహార్లో జరిగిన తొలిసారి అరరియా లోక్‌సభ సీటుకు జరిగిన ఉపఎన్నిక బీజేపీకి చేదు అనుభవాన్నే మిగిల్చింది. జైలులో ఉన్న లాలూ ప్రసాద్ కరిష్మా ముందు మోదీ-నితీశ్‌ జోడీ నిలబడలేకపోయింది. ప్రతిష్ఠాత్మక ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ డిపాజిట్లు సైతం దక్కించుకోలేక చతికిలపడటం, ప్రాంతీయ పక్షాలదే పైచేయి కావడాన్ని బట్టి దేశరాజకీయ ముఖచిత్రం ఏ రీతిన రూపుదిద్దుకుంటున్నదో అర్థం చేసుకోవచ్చు.


ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్‌ మౌర్యలు ఖాళీ చేసిన గోరఖ్‌పూర్‌, ఫూల్‌పూర్‌ లోక్‌సభ స్థానాలను రెండింటినీ సమాజ్‌వాదీ-బహుజన సమాజ్వాదీ  పార్టీతో జతకట్టి గెలుచుకుంది. బిహార్‌ లో అరరియా లోక్‌సభ స్థానాన్ని ఆర్జేడీ నిలబెట్టుకుంది. వారం క్రితం త్రిపుర శాసనసభ ఎన్నికల్లో సీపీఎంపై చరిత్రాత్మక విజయం సాధించి మంచి ఉత్సాహంలో ఉన్న కమలానికి ఇంతలోనే ఈ ఫలితాలు కషాయాన్ని రుచి చూపి చేదు అనుభవం మిగిల్చింది.

ఏడాది క్రితం శాసనసభ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన ఎస్పీ, బీఎస్పీలు ఆ గుణపాఠంతో ఈసారి కలిసి పనిచేయడమే ఈ విపరీత ఫలితానికి కారణం. ఆదివారం పోలింగ్‌ లో చాలా తక్కువ శాతం ఓట్లు పోలవడంతో అధికారపార్టీదే విజయమని విశ్లేషకులు భావించారు. అయితే, బీఎస్పీ తన ఓట్లను విజయవంతంగా ఎస్పీకి బదలా యించడంతో అఖిలేశ్‌ యాదవ్‌ పార్టీ రెండు సీట్లనూ దక్కించుకుంది. లోక్‌సభ బరిలో సహకరించినందుకు మాయావతికి రాజ్యసభ సీటును ఎస్పీ కట్టబెట్టనుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి, ఉపముఖ్యమంత్రి మౌర్య గత లోక్‌సభ ఎన్నికల్లో మూడేసి లక్షలమెజారిటీతో గెలిచిన సీట్లను ఓడిపోవడం బీజేపీకి అవమానాన్ని మిగిల్చింది. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్‌, ఆయన గురువు మహంత్‌ అవేద్యనాథ్‌ మూడు దశాబ్దాలుగా గోరఖ్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహించారు.

ఉప ఎన్నికల్లో భబువా అసెంబ్లీ నియోజకవర్గాన్ని మళ్లీ బీజేపీ సొంతం చేసుకుంది. బీజేపీ నాయకురాలు రింకీ రాణి పాండే విజయం సాధించారు. ఇటీవల రింకీ భర్త ఆనంద్ భూషణ్ పాండే మృతితో ఖాళీ అయిన భబువాకు ఉపఎన్నిక జరిగింది. ఆనంద్ భూషణ్ భార్య రింకీని బరిలో నిలపగా సానుభూతి ఓట్లు పడ్డాయి. దీంతో కనీసం ఈ ఒక్క స్థానాన్నైనా బీజేపీ సొంతం చేసుకోగలిగిందని బీజేపీకి స్వల్ప ఊరట లభించిందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: