2019లో బాబును ఓడించనున్న లోకేశ్ అవినీతి..!?

Chakravarthi Kalyan
2019 ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్ అండతో అతి కొద్ది తేడాలో అధికారం అందుకున్న చంద్రబాబుకు 2019లో చుక్కలు కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నాలుగేళ్లలో చంద్రబాబు సర్కారు చెప్పుకోదగిన విజయం ఒక్కటీ సాధించలేకపోయింది. రాజధాని ఎక్కడిదక్కే ఉంది. మిగిలిన రంగాల్లోనూ నామమాత్రంగానే ప్రగతి కనిపిస్తోంది. 


దీనికి తోడు కేంద్రంతో నిన్నమొన్నటివరకూ అంటకాని ఇప్పుడు మేం మోసపోయామంటూ జనంలోకి వచ్చిన తీరుకు కూడా మెచ్చదగింది కాదు. వీటన్నిటికీ మించి చంద్రబాబు సర్కారుపై పడుతున్న అవినీతి ముద్ర పెను ప్రమాదం తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ను గత ఎన్నికల్లో అవినీతి భూతంగా చూపించిన టీడీపీ ఇప్పుడు తానే ఆయన విమర్శలు ఎదుర్కొంటోంది. 


లోకేశ్ అవినీతిపై కొన్నాళ్లుగా చర్చ జరుగుతున్నా ఇప్పుడు పవన్ కల్యాణ్ దాడితో ఆ చర్చ మరింత విస్తృతం కానుంది. జగన్ ను ఎదుర్కొనేందుకు ఒక్కో నియోజకవర్గానికి పాతిక కోట్లు పక్కకుపెట్టామని లోకేశ్ ఇప్పటికే బహిరంగంగా చెబుతున్నారన్న వార్తలు కలవరం కలిగిస్తున్నాయి. ఇక ముందు ఈ విషయం హైలెట్ గా మారింతే చంద్రబాబు సర్కారుపై అవినీతి మరక ప్రధాన మైనస్ పాయింట్ కానుంది. 


గతంలో అండగా నిలిచిన బీజేపీ దూరమైంది. మోడీ మానియా లేదు. పవన్ కల్యాణ్ అండలేదు.. సాధించిన ప్రగతి కనిపించడంలేదు. మరోవైపు లోకేశ్ అవినీతి ముద్ర భయపెడుతోంది. ఇన్ని మైనస్ ల మధ్య వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: