భారత్ వ‌దిలి వెళ్ల‌కుండా 91 మంది బ్యాంక్ ఋణ ఎగవేతదార్లపై నిషేధం !

కొందరు భారత బడాబాబులు బ్యాంకులలో ఋణాలు తీసుకొని ఎగవేత కార్యక్రమం మొదలెట్టి ఆపై దేశం వదలి రాత్రికి రాత్రే ప్రభుత్వ సంస్థల కళ్ళుకప్పి సరిహద్దులు దాటేసి సురక్షిత ప్రదేశాలకు పారిపోతున్నారు. ఉదాహరణకు విజయ్ మాల్య, నీరవ్ మోడీ, మెహల్ చోక్సి ఇలా అనేకులు.

వివిధ రకాల ప్రలోభాలను బాంకులకు అందులోని అధికారులకు ఉద్యోగులకు ఎరవేసి వాళ్ళ వాళ్ళ వ్యాపార అవసరాల పేరుతో గ‌త రెండు ద‌శాబ్దాలుగా భారత వ్యాపార‌ వేత్త‌లు, బ‌డా కార్పొరేట్లు వేల కోట్ల రుణాల‌ను దేశీయ బ్యాంకుల నుంచి తీసుకుంటున్నారు.

అనేక వ్యాపారేతర కార‌ణాలవ‌ల్ల, ఋణాల ద్వారా లభించిన సొమ్మును వ్యాపారం నుంచి దారి మళ్ళించి తద్వారా లాభాలు ఆర్జించ‌లేక మునిగిపోయి స‌మ‌యానికి అప్పులు తీర్చ‌లేక‌పోతున్నారు. ఇప్పుడు బ్యాంకులు ఈ మోసకారి వ్యాపారులను గుర్తించి ప్ర‌భుత్వ ఏజెన్సీల‌కు, ప్ర‌భుత్వ సంస్థలకు నివేదించే స‌మయానికి వారు సరాసరి దేశమే  వ‌దిలి పారిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది.

ఎగవేతదారులు - డీఫాల్ట‌ర్ల గురించి స‌మాచారాన్ని స‌మ‌గ్రంగా సేక‌రించి పెట్టుకుంటోంది.  బ్యాంకులు అప్రమత్తం చేసి ముందుగానే ఇప్పుడు "ఉద్దేశ‌పూర్వ‌క ఎగ‌వేతదార్ల" అంటే "విల్ఫుల్ - డిఫాల్టర్ల" జాబితాను కేంద్రం సిద్దం చేసింది. ఇప్పుడు మొత్తం 400 మంది ఉద్దేశ‌ పూర్వ‌క ఎగ‌వేత‌దార్లను గుర్తించింది. అందులో నుంచి 91 మందిని ప్ర‌త్యేకంగా ఎంపికచేసి జాబితాను రూపొందించి, స‌మాచారాన్ని ప్ర‌జల్లోకి  తీసుకు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అనధికారిక సమాచారం. 


ప్ర‌ధాని నేతృత్వంలోని అధికారబృందం భారీగా రుణాలిచ్చిన ఆర్థికసంస్థ‌లు, బ్యాంకుల‌ రుణగ్ర‌హీత‌ల గుర్తింపు క‌నుగొనాల్సిందిగా ఆదేశాలిచ్చింది. అంతే కాకుండా  రూ.50 కోట్లకుమించి రుణాలు పొందిన వారి పాస్-పోర్టు వివ‌రాల‌ను సేక‌రించాల్సిందిగా సంబంధిత సంస్థ‌ల‌కు ఆదేశాలు వెళ్లాయి.

నీర‌వ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి వ్య‌క్తులు పీఎన్బీ కుంభ‌కోణానికి పాల్ప‌డిన త‌ర్వాత మోదీ పాల‌న‌పై ప్ర‌జాగ్ర‌హం పెరిగింది. పీఎన్బీ కుంభ‌కోణం మీడియాకు వెల్ల‌డి కావ‌డానికి కొద్దిరోజుల ముందే నీర‌వ్ మోదీ దేశం వ‌దిలిపారిపోయిన సంగ‌తి తెలిసిందే. బ్యాంకులు, ఆర్థికసంస్థ‌లు స‌రైనస‌మ‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇప్పుడు ప్ర‌భుత్వానికి ఈ త‌ల‌నొప్పులు వ‌చ్చాయి.


అది గమనించి నిఘావర్గాలను, బ్యాంకు ఉన్నత అధికార వర్గాలను అప్రమత్తం చేసి ఇలా నేరగాళ్ళను, నేరగాళ్లుగా మారి దేశం వదలిపెట్టి పోయేవాళ్ళ ఆలోచనలను శ్రద్ధగానే గమనిస్తుంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని జాగృతమవటం దేశానికి శ్రేయోదాయకం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: