జగన్ నాయకత్వంలో చంద్రబాబు..!

Edari Rama Krishna
ప్రత్యేక హోదా సాధన దిశగా పోరాటాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉధృతం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై లోక్‌సభలో రేపు అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది.  ఏపికి ప్రత్యేక హోదా కోసం టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. అవిశ్వాసానికి విపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు టీడీపీ సీనియర్‌ నాయకులు, అందుబాటులో ఉన్న మం​త్రులతో అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో గురువారం మధ్యాహ్నం మంతనాలు సాగించారు.  లోక్‌సభలో రేపు అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

కేంద్రంతో ఇప్పటి వరకు స్నేహసంబంధాలు  ఉన్నా..రిసెంట్ గా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.  దాంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలు ఒకేతాటిపైకి వస్తున్నట్లు కనిపిస్తుంది. ఏపిలో ఇప్పుడు బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేన అన్ని పార్టీలది  ఒకే నినాదం ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించడం. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి..అందుకు వైసీపీ మద్దతు తెలిపేందుకు సుముఖత వ్యక్తం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.   

కేంద్ర ప్రభుత్వ తీరు, జనసేన వ్యవహారంపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ను బీజేపీ నడిపిస్తోందన్న అభిప్రాయాన్ని టీడీపీ నాయకులు ఈ భేటీలో వ్యక్తం చేసినట్టు సమాచారం. 

 అయితే వైసీపీ తీర్మానానికి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలని కొందరు మంత్రులు అభ్యంతరం తెలపగా..రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మద్దతు ఇవ్వాని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వర్గానికి తెలిపిన సీఎం చంద్రబాబు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని మంత్రివర్గానికి తెలిపినట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: