రాజ్య సభకు చిరంజీవి డుమ్మా..ఎందుకు..!

Edari Rama Krishna
ప్రస్తుతం రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై పెద్ద దుమారమే చెలరేగుతుంది.  ఏపిలో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా నినాదమే వినిపిస్తుంది.  ఈ మద్య కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని ఖరాకండీగా చెప్పారు. దాంతో ప్రజలు, అధికార, విపక్షాలు మొత్తం అగ్రహంతో ఊగిపోతున్నాయి.  ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కేంద్రంతో పోరాటం కొనసాగించేందుకు కంకనం కట్టుకున్నారు.  పార్లమెంట్ లో టీడీపీ, వైసీపీ ఎంపీలు గత కొన్ని రోజులుగా ప్రత్యేక హోదా కోసం నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. 

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాన్ జనసేన పార్టీ తరుపు నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.  తెలుగు హీరో, రాజ్యసభ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు రాలేక పోతున్నానని రాజ్య సభ చైర్మన్ వెంకయ్య లేఖ పంపించారు.  ఈ నేపథ్యంలో రాజ్య సభకు రాలేకపోతున్నానని.. సెలవులు కావాలన్న సినీ నటుడు చిరంజీవి అభ్యర్థనను చైర్మన్ వెంకయ్య అంగీకరించారు. మార్చి 5 నుంచి.. ఏప్రిల్ 2 వరకు జరుగుతున్న సెషన్ కు హాజరుకాలేకపోతున్నానని చిరంజీవి పంపిన లెటర్ ను ఆయన చదివి వినిపించారు.

ప్రస్తుతం రాజ్యసభ నడుస్తున్న తీరు ఆవేదన కలిగిస్తోందన్నారు  వెంకయ్య నాయుడు. ఎంపీలు కోరుతున్న అంశాలపై చర్చకు సభ సిద్ధంగా ఉందని చెప్పారు వెంకయ్య.  శుక్రవారం (మార్చి-16) రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటి తర్వాత విపక్షాలు ఆందోళనకు సిద్దం కావడంతో చైర్మన్ వెంకయ్య వారికి క్లాస్ తీసుకున్నారు. కనీసం వచ్చే వారంనుంచైనా సభకు అందరూ సహకరించాలని కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: