శశికళ భర్త నటరాజన్ కన్నుమూత

Edari Rama Krishna
గత కొంత కాలంగా తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పిన శశికళ అలియాస్ చిన్నమ్మ ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్న సంగతి తెలిసిందే.  దివంగత ముఖ్యమంత్రి జయలలితకు శశికళ స్నేహితురాలు.  జయలలిత మరణించే సమయంలో ఆమె పక్కనే ఉన్నారు. అయితే జయలిత వారసురాలిగా తమిళనాడు పీఠం ఎక్కాలని ఎన్నో ప్రయాత్నాలు చేసినప్పటికీ ఆమె ప్రయత్నాలు సఫలం కాలేదు.

  గత కొంతకాలంగా కిడ్నీ సంబధిత సమస్యలతో బాధపడుతున్న వీకే శశికళ భర్త ఎం.నటరాజన్ (74) సోమవారం అర్ధరాత్రి దాటాక ఆసుపత్రిలో కన్నుమూశారు. గతేడాది అక్టోబరులో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న ఆయన.. రెండు వారాల క్రితం అనారోగ్యంతో చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు.1975లో శశికళను వివాహం చేసుకున్న నటరాజన్ జయలలితకు కొన్నాళ్లపాటు రాజకీయ సలహాదారుగా కూడా పనిచేశారు.

కాగా నటరాజన్ విద్యార్థి దశ నుంచి డీఎంకేలో చురుకైన పాత్రను పోషించేవారు. నటరాజన్ కు శశికళకు డీఎంకే అధినేత కరుణానిధి ఇరువురికి వివాహం జరిపించారు. కాగా నటరాజన్ భౌతికకాయాన్ని చెన్నై నుండి తంజావూరుకు తరలించనున్నారు.భర్త ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సోమవారం రాత్రే శశికళకు సమాచారం అందించారు.

దీంతో జైల్లోనే ఆమె బోరున విలపించినట్టు తెలుస్తోంది. భర్త కడసారి చూపు కోసం ఆమె పెరోల్ దరఖాస్తు చేసుకున్నారు. కాగా,  నటరాజన్‌ను కాపాడేందుకు తాము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని గ్లోబల్ హెల్త్ సిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షణ్ముగ ప్రియన్ తెలిపారు. ఆయన ప్రాణాలను కాపాడుకునేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని గ్లోబల్ హెల్త్ సిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షణ్ముగ ప్రియన్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: