రాజ్యసభ ఎలక్షన్లు - 2018

Edari Rama Krishna
పెద్దల సభలో మహా సంగ్రామానికి గంట మోగిన విషయం తెలిసిందే. 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.  ఈ నెల 5 న నోటిఫికేషన్ వెలువడింది. ఏప్రిల్ 2 తో పదవీకాలం ముగియనున్న రాజ్యసభ స్థానాలకు మార్చి 23న జరపనున్నట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. దేశంలోని 16 రాష్ట్రాలలోని 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పదవీకాలం ముగుస్తున్న రాజ్యసభ సభ్యుల్లో తెలంగాణ నుంచి రాపోలు ఆనందభాస్కర్(కాంగ్రెస్), విభజన సమయంలో తెలంగాణకు కేటాయించిన సీఎం రమేష్ (టీడీపీ) ఉండగా, పాల్వాయి గోవర్దన్ రెడ్డి (కాంగ్రెస్) మృతితో మరో స్థానం ఖాళీగా ఉంది.

ఏపీ నుంచి చిరంజీవితో పాటు విభజన సమయంలో ఏపీకి కేటాయించిన దేవేందర్ గౌడ్, రేణుకాచౌదరి ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత శాసనసభ్యుల సంఖ్యా బలం ప్రకారం ఖాళీ అయ్యే మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు అధికార టిడిపి, ఒకటి ప్రతిపక్ష వైసిపి కైవశం చేసుకునే అవకాశముంది. ఒక రాజ్యసభ సభ్యుడు గెలుపొందేందుకు 44 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంది. గత ఎన్నికల్లో వైసిపి నుంచి 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 22మంది పార్టీ ఫిరాయించి, అధికార టిడిపిలో చేరారు.

దీంతో వైసిపికి ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేలున్నారు. కనుక ఒక రాజ్యసభ స్థానం వైసిపి సొంతం కానుంది. మిగిలిన రెండు స్థానాలు అధికార టిడిపి వశం కానున్నాయి.  ఇందులో తెలంగాణలో 3 స్థానాలు, ఎపీ 3, బీహార్ 6, ఛత్తీస్‌గఢ్ 1, ఉత్తరాఖండ్ 1, పశ్చిమబెంగాల్ 5, ఒడిశా 3, జార్ఖండ్ 2, గుజరాత్ 4, హర్యానా 1, హిమాచల్ ప్రదేశ్ 1, కర్ణాటక 4, మధ్య ప్రదేశ్ 5, మహారాష్ట్ర 6, ఉత్తరప్రదేశ్ 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేయడానికి మార్చి 23న ఓటింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే నామినేషన్ల దాఖలుకు మార్చి 12 అభ్యర్థులు నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మార్చి 15 పూర్తి అయ్యింది.  మార్చి 23 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: