హవ్వా..బిల్ బోర్డులో బూతు చిత్రం ప్రత్యక్షం

siri Madhukar
ఫిలిప్పైన్స్‌లో గత కొంత కాలంగా పోర్న్‌ను పూర్తిగా  నిషేధించారు. అలాంటిది అక్కడ నడిరోడ్డుపై హైవే పక్కనే ఉన్న బిల్ బోర్డులో ఫోర్న్ వీడియో అరక్షణం పాటు ప్రసారం కావడం..అంతా షాక్ తిన్నారు.  దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం తెలిసిన వెంటనే నగర మేయర్ ఫోర్న్ చిత్రాన్ని నిలిపివేశారు. ఆ హైవేపై కొన్ని చోట్ల ఎలక్ట్రానిక్ బిల్‌బోర్డులను అమర్చారు. ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పడానికి వాటిని ఉపయోగిస్తారు. అయితే.. ఆ హైవేపై ఉన్న ఓ బిల్‌బోర్డులో ట్రాఫిక్ రూల్స్‌కు బదులు పోర్న్ వీడియో ప్రసారమైంది. 


ఒక్కసారే  ఈ ఫోర్న్ వీడియోను  ప్రత్యక్షం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బిల్ బోర్డులో ఫోర్న్ వీడియో ప్రసారమౌతున్న విషయాన్ని నగర మేయర్‌ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో ఆయన బిల్ బోర్డులో ఫోర్న్ వీడియోను నిలిపివేశారు. అయితే బిల్ బోర్డులో ప్రసారమైన అశ్లీల వీడియోలను వాహనదారులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. 


ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.దీంతో ఈ విషయం కాస్త.. ఫిలిప్పైన్స్ మేయర్‌కు తెలియడంతో ఆ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. నిజానికి ఫిలిప్పైన్స్‌లో పోర్న్‌ను నిషేధించారు. అయినప్పటికీ.. ఇలా బిల్‌బోర్డ్‌పై పోర్న్ క్లిప్ ప్రత్యక్షమవడంతో అక్కడ ఈ ఘటన చర్చనీయాంశమైంది.  ఈ న్యూస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: