జనసేన "మైండ్ గేం" టిడిపికి "లైఫ్ ట్రబుల్"

జనసేన ఇప్పటికే రాజకీయ పార్టీగా మారిపోయింది. అంటే ప్లేట్ ఫిరాయించటంలో ఆరితేరి పోయింది. మళ్లీ ప్లేట్ ఫిరాయించింది ఎలాంటారా  "లోకేష్ అవినీతి బాగోతం" అంటూ గుంటూరు సభలో సంచలనం సృష్టించేలా వ్యాఖ్యలు చేసి అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆ తర్వాత రెండు సార్లలకు పైగా పిల్లి మొగ్గ  లేశారు.


లోకేష్ అవినీతి పై తనవద్ద ఎలాంటి ఆధారాలు లేవని, అందరూ అనుకుంటున్న మాటనే తాను కూడా అన్నానని ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పు కొచ్చారు జనసేన పార్టీ అధినేత. దీంతో లోకేష్‌ తో పాటు టీడీపీ శ్రేణులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నాయి. కానీ, లోకేష్ అవినీతి పై తమ వద్ద ఆధారాలున్నాయని అంటూ మాట మార్చేసింది జనసేన. కేంద్ర సంస్థ తో ఆ విషయంపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్.


మంత్రి లోకేశ్ అవినీతి వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. ఆయన అవినీతిపై ఢిల్లీ స్థాయి ఏజెన్సీతో విచారణ చేపట్టాలని కోరుతామని తెలిపారు. త్వరలో ఏపీ మంత్రులు, వారి కుటుంబ సభ్యుల బండారం బయటపెట్టేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొన్న భూములకు సంబంధించి అన్ని లెక్కలు తమ వద్ద ఉన్నాయని ఆ పార్టీ నేతలు అద్దేపల్లి శ్రీధర్, మహేందర్ రెడ్డి, రియాజ్ వివరించారు. జనసేన పార్టీ ఆవిర్భావసభలో లోకేశ్ అవినీతిపై, చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలపై పవన్ విమర్శించిన నేపథ్యంలో లోకేశ్‌, జనసేన మధ్య రాజకీయాలు వేడెక్కాయి.


ఇప్పటికే టీడీపీ పై కుతికల వరకు ఆగ్రహోద్రేకాలు వెలిబుచ్చుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం, టిడిపితో ఇప్పటివరకు మైత్రి నెఱపిన జనసేన డిమాండ్‌ ని సీరియస్‌ గా తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.


ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందన్న సమాచారం నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థలు సీబీఐ, ఈడీ  రంగం లోకి దిగినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదంటూ అనేక పత్రికల్లో వార్తా చానళ్ళలో (పచ్చ పార్టీకి మద్దతు నిచ్చే కొన్ని పచ్చ మీడియా సంస్థలు తప్ప) విశ్లేషణలు వస్తున్నాయి.


మరోవైపు లోకేష్ అవినీతికి సంబంధించి 40మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, వారి వారసులు తమతో మాట్లాడుతూనే వున్నారని, ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసని చెబుతున్న జనసేన బలంగా బల్లగుద్ది మరీ చెపుతుంది. ఇలా చంద్రబాబు తో ఒక ప్రత్యేకమైన "మైండ్ గేమ్" జనసేన మొదలెట్టినట్టు తెలుస్తోంది. కొంతమంది ఐతే పవన్ కళ్యాణ్ ని బిజెపి ఎప్పుడో టిడిపిపై ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం అని అంటున్నారు. నాలుగేళ్ళ నుండి సమాచారం సేకరించి ఇప్పుడు జనసేన అధినేత ఒక్కసారి బయట పడ్డారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: