టిడిపి ప్రభుత్వ పూజారి పాత్ర లేకుంటే ఏపికి కేంద్ర నిధులు సరిగానె అందివుండేవా?

"పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎవరైనా చేతులు పెట్టాలంటే వారి చేతులు కాలిపోతాయే తప్ప...ఎవరూ ఏమీ చేయలేరు" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలే చేశారు. అయితే చంద్ర బాబు మాటలను ఏమాత్రం లక్ష్య పెట్టి పరిగణనలోకి తీసుకున్నట్లుగా కనిపించని కేంద్రప్రభుత్వం ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు ₹1400 కోట్లను విడుదల చేసేందుకు దాదాపుగా నిర్ణయించింది.


అయితే ఆయన వ్యాఖ్యలతో నిమిత్తం లేకుండా కెంద్రంలోని బాజపా ప్రభుత్వం పోలవరం ప్రోజెక్టుకు నిధులు విడుదల చేయటానికి సన్నాహాలు చేసింది.  ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ నుంచి కేంద్ర జలవనరులశాఖకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. నాబార్డు నుంచి రుణంగా ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేస్తున్నట్లుగా సమాచారం.


అయితే ప్రస్తుతం ₹1795 కోట్లను పోలవరానికి విడుదల చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఆ నిధుల్లో భాగంగానే ఇప్పుడు ₹1400 కోట్లను విడుదల చేసేందుకు మార్గం సుగమం చేసిన కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఆడిట్లు వచ్చిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోరిన విధంగానే మరో ₹300 కోట్లు విడుదల చేయనున్నట్లు ఆర్థికశాఖ తెలిపింది.


"ఆంధ్రప్రదేశ్‌కు మేం మేలు చేయాలనే భావిస్తూనే ఉన్నాం. కానీ, టీడీపీ, వైసీపీ పార్టీల రాజకీయ లబ్ధికోసం ఇదంతా చేస్తున్నాయి. చేసుకోనివ్వండి. ఎవరు ఎలా వ్యవహరించినా మేము మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేస్తాం. రైల్వే జోన్‌ ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నాం" అని ప్రధాని నరెంద్ర మోదీ తనతో చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత నిన్న బుధవారం ఆమె పార్లమెంటు భవనంలో మోదీని కలిశారు. ఆ తర్వాత ఈవిషయాన్ని మీడియాకు వెల్లడించారు.


విభజన గాయాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో చేయూత నివ్వాలని ప్రధానికి విన్నవించానని కూడా గీత తెలిపారు. రాష్ట్రానికి పూర్తిగా న్యాయం చేస్తానని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను క్రమంగా నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ విషయంలో వెనుకడుగు వేసేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసినట్లు కొత్తపల్లి గీత తెలిపారు. దానికి కట్టుబడి ఉన్నట్లుగా ఈ నిధుల విడుదల కనిపిస్తుంది.


ఇక కేంద్రం సకాలంలోనే నిధులు విడుదల చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కారణం ఇప్పుడు కెంద్రంలోని బిజెపి తో రాష్ట్రంలోని టిడిపి సంబంధ బాంధవ్యాలను తెగతెంపులు చేసుకున్న దృష్ట్యా ఇక కేంద్ర నిధుల దారిమళ్ళింపు అంత తేలిక కాకపోవచ్చు. అందుకే ఆ నిధుల సహకారం క్రెడిట్ డైరెక్టుగా కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది తప్ప మద్యలో తెలుగు దేశం పూజారి పాత్ర ఉండని దరిమిలా ఇక కేంద్ర సహకారం సరిగానే ఉండొచ్చని పరిశీలకుల భావన. 

 


మొత్తం మీద తెలుగు దేశం అధినేత చంద్రబాబుతో పొత్తు ఉన్నా లేకున్నా, తాను ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నట్లుగా చెప్పుకునేందుకే కేంద్రం ఈ నిధులను విడుదల చేసినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: