చంద్రబాబు మెడకు చుట్టుకున్న పట్టిసీమ..సీబీఐ విచారణ?!

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా పట్టిసీమ ప్రాజెక్టు పై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఏపీ అసెంబ్లీలో  పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.   ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రూ. 350 కోట్ల మేర అవినీతి జరిగింది. దీనిపై సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ చేయించాలని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.  

 కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదికలో చెప్పిన గణాంకాలనే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. పట్టిసీమలో అవినీతి చోటుచేసుకుందని కాగ్‌ నివేదిక చెబుతోందని పేర్కొన్నారు. విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ మొదట్లో తమకు తెలియదని కాగ్ నివేదిక చూశాకే మాట్లాడుతున్నానని, ఆధారాలు లేకుండా మాట్లాడడం సరికాదని, కాగ్ నివేదిక చూసిన తర్వాతే మాట్లాడుతున్నానని అన్నారు.

పట్టిసీమకు రూ.190 కోట్లు వృథాగా ఖర్చు పెట్టారని, మరో రూ.371 కోట్లు దుర్వినియోగం అయినట్లు కాగ్ తెలిపిందని విష్ణుకుమార్ రాజు అన్నారు. పట్టిసీమపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో దర్యాప్తు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. క్యూబిక్ మీటర్ మట్టి తీయడానికి రూ.21,350 ఖర్చు చేశారని ఆరోపించారు.   
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: