సినిమావాళ్లపై నేను చేసిన వ్యాఖ్యలకు క్షమించండి : రాజేంద్ర ప్రసాద్‌

siri Madhukar
ఏపీలో ప్రతిసారి కాంట్రవర్సీ మాటలు మాట్లాడుతూ..సంచలనాలు రేపే ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌ ఈ మద్య తెలుగు హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రతరం అవుతున్న సమయంలో తెలుగు హీరోలు మాత్రం సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ..హీరోయిన్లతో డ్యాన్స్ లు వేస్తున్నారని ఆరోపించారు. 

ఓ పక్క ఆంధ్రప్రజలు కేంద్రం చేసిన మోసంతో ఆగ్రహంతో ఊగిపోతుంటే..సినిమా హీరోలు వారి పక్షాన నిలబడకుండా..తమ సినిమాలు చేసుకుంటూ పోతున్నారని..సినిమా కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డబ్బులు తింటోన్న సినీ పరిశ్రమ, ప్రత్యేక హోదా కోసం ఎందుకు నిరసన చేయట్లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

కాగా, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వాఖ్యాల పై తమ్మారెడ్డి భరద్వాజ, టీడీపీ ఎంపీ మురళీ మోహన్, సినీ నటి కవితతో పాటు పలువురు ప్రతి విమర్శలు గుప్పించారు. వ్యవహారం శృతి మించిపోయే ప్రమాదం ఉందని అధికార పార్టీ రాజేంద్రప్రసాద్ మందటించినట్లు సమాచారం. దీంతో  బాబూ రాజేంద్రప్రసాద్... తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.

తాను ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశంతో అలా మాట్లాడలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబుకి అండగా నిలవాలని చేసిన వ్యాఖ్యలను సినిమావారు అర్థం చేసుకోవాలని అన్నారు. సినిమా వాళ్లు ప్రత్యేకహోదా కోసం పోరాడితే ఏపీకి మేలు జరుగుతుందన్నదే తన ఉద్దేశ్యమని అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: