అరుణ్ జైట్లితో ముఖ్యమంత్రి దూత భేటీ - టిడిపి యూ-టర్న్? నేతల్లో కలవరం

తెలుగుదేశం పార్టీ తొలినుంచీ అనుమానాస్పదం గానే ప్రవర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరూ అంగీకరిస్తూనే ఉంటారు. ఉదయం బ్రేక్-ఫాస్ట్ సమయంలో ఒక నిర్ణయం, మద్యహ్నం భోజనసమయంలో మరో నిర్ణయం, రాత్రికి ఇంకో నిర్ణయం - అర్ధరాత్రికి అంతా అయోమయం చేసేస్తారని అంటున్నారు అంతా.  ఐదు కోట్ల ఆంధ్రు లను మరోసారి మోసం చేయాలనుకున్న టీడీపీ పన్నాగం గుట్టు రట్టైందని అంటున్నారు. పైకి ప్రత్యేక హోదా పోరాటం చేస్తున్నట్లు నటిస్తోన్న పచ్చపార్టీ నేతలు,  మాత్రం ప్యాకేజీ కోసం ఆరాటపడుతూ, ఆ మేరకు కేంద్ర మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తోన్న వైనం తేటతెల్లమైంది. 

సీఎం చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో అన్నీ తానై వ్యవహరించే సుజనా చౌదరి, బీజేపీ కీలక నేత, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తో రహస్యంగా భేటీ అయ్యారన్న సమాచారం టీడీపీలో కలవరం రేపుతోంది. శుక్రవారం ఉదయం చంద్రబాబు నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌ లో "రహస్య భేటీ" అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో అనివార్యంగా ప్రత్యేక పోరాటంలోకి దిగిన టీడీపీ, ఇప్పుడు మళ్లీ ప్రత్యేక ప్యాకేజీకే జై కొట్టనున్నట్లు తెలిసింది. గడిచి న మూడు రోజులుగా జరిగిన పరిణామాలు యూ-టర్న్‌ తీసుకోవటం నిజమని సంకేతాలిచ్చినట్లు అర్ధమౌతుంది. ముఖ్యమంత్రి దూత గా సుజనా చౌదరి బుధవారం రాత్రి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీని రహస్యంగా కలుసుకున్నారని తెలిసింది. 

గతంలో ప్రకటించిన ప్యాకేజీ నిధులను తక్షణమే విడుదల చేస్తే, బీజేపీ-టీడీపీలు తిరిగి ఏకమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని దూత సుజనా చౌదరి వివరించినట్లు సమా చారం. ముందస్తుగా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.1400 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించడం కూడా ఈ "లాలూచీ అఫైర్"లో భాగమేనని తెలుస్తోంది. టీడీపీ-బీజేపీ రీ-యూని యన్‌ కు సంబంధించి ఈ మేరకు చంద్రబాబు అనుకూల మీడియా లోనూ పెద్ద ఎత్తున వార్తలు రావడం గమనార్హం.

"రహస్య సమావేశం"పై శుక్రవారంనాటి టెలీకాన్ఫరెన్స్‌ లో తీవ్ర దుమారం చెలరేగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అరుణ్ జైట్లీతో భేటీపై సుజనా, చంద్రబాబు, యనమల రామకృష్ణుడు పరస్పర విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖ రైల్వే జోన్‌, ఉక్కు ఫ్యాక్టరీపై క్లారిటీ కోసమే అరుణ్ జైట్లీ చాంబర్‌కు వెళ్లానని సుజనా చౌదరి వివరణ ఇచ్చారని, ప్రత్యేక హోదా కోసం పోరాటం జరుగుతున్న సమయంలో ఇలాంటి సమావేశాల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని యనమల అన్నట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. దానికి చంద్రబాబు, ఎవరు ఎవరితో నైనా మర్యాద పూర్వకంగా కలిసి, మాట్లాడొచ్చని, అయితే తనకు తెలియకుండా వెళ్లడం సరి కాదని అన్నట్లు తెలిసింది.

ప్రత్యేక ప్యాకేజీ కోసమే అరుణ్ జైట్లీతో సుజనా భేటీ అయ్యారన్న సమాచారం గుట్టు రట్టు కావడంతో టీడీపీ వర్గాల్లో ఒక్కసారే కలకలం రేగింది. టీడీపీకి సంబంధించి ఢిల్లీలో అన్ని వ్యవహారాలను అధికారికంగా చూసుకునే సుజనా చౌదరి, చంద్రబాబుకు తెలియకుండా అరుణ్ జైట్లీతో భేటీ అవుతారని నమ్మలేమని, ఖచ్చితంగా ఏదో జరుగు తోందని టీడీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: