పెద్ద జోకింగ్ స్టాక్ గా మిగిలిపోయిన ది గ్రేట్ "శొంఠినేని శివాజి"

తెలుగుదేశం (పార్టీ) బాధ ఆంధ్రప్రజల బాధగా మార్చాలనేది "తెలుగుదేశం పార్టీ తీవ్ర ప్రేమికుల (టిటిపి)" ఆశయం. టిటిపి వారికి రాష్ట్రాన్ని ప్రస్థుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినా గొప్పనాయకుడు పాలించటానికి సరిపోడని ఆయనే ఒక అద్భుత నాయకుడని, భావనతో వారి హృదయాలలో నిలుపుకొని తరించిపోతున్నారు. వీళ్ళంతా చంద్రబాబు తనకు తాను చెసుకునే "స్వకుచమర్ధనం" నిజమనే భావనలో జీవిస్తున్నారు. ఇక్కడ వ్యక్తి ఆరాధన ఒక వర్గానికి పరిమితమై పోయింది. అలాంటి వ్యక్తులంతా ఒక వర్గమయ్యారు. లేక వర్గమంతా ఆయన ఆరాధకులు అయ్యారు. 

ఒక్క చంద్రబాబు తాను నిప్పునని అంటే ఆయన వర్గ మీడియా మొత్తం తెల్లవారేసరికి అనేక పత్రికలు, అనేక న్యూస్ చానల్స్ ఒకటై వేయిగొంతుకలతో ప్రతి రోజూ వాయించేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ను కొన్ని రాజకీయ వర్గాలు సర్వనాశనం చేసే పన్నాగం పన్నుతున్నాయని ప్రచారం మొదలెట్టారు. దానికి ఆపరేషన్ ద్రవిడ, గరుడ, రావణ, కుమార పేర్లతో ఒక అద్భుతమైన కథ, కథనం సృష్టితున్నారు దీన్ని తన భుజస్కందాలపై వేసుకున్నారు శొంటినేని శివాజి. చివరకు ఏ రాజకీయ పక్షమైనా వ్యూహాలు అలాగే పన్నుతుంటారని ఒక్కసారిగా సామాజిక మీడియా దాడిచేసి,  ఆయన్ని తెములుకోనివ్వలేదు. 

అబద్ధాలు చెప్పి చెప్పి ఏది నిజమో తెలియని అయోమయ పరిస్థితుల్లో చిక్కుకున్నారు చంద్రబాబు. అసంఖ్యాక "యూ-టర్నులు"  తీసుకొని అసలు దారే మర్చిపోయింది తెలుగుదేశం. మొత్తం టిడిపి సభ్యులు అంతా ఒకటే మాట. టిడిపికి మద్దతిచ్చే మీడియా లీకులిస్తే ఆ లీకుల్ని అధినేత ఆదేశాలుగా స్పందించే సాంప్రదాయంగా మారి పోయింది. పార్టీలో సభ్యులంతా వందిమాగధులై భజన కార్యక్రమాలు మొదలెడతారు. ప్రజాస్వామ్య విలువలు ఊడ్చి అందరూ బానిసలుగా మారిపోయిన ఉదంతానికి పెద్ద ఉదాహరణ "శొంటినేని శివాజి" 

ఇప్పటివరకు, కాపిటల్ నిర్మాణానికి అనేక శంకుస్థాపనలు చేశారు వాటిపై చేసిన ధన దుబారా చేశారు. ఒక కాపిటల్ నిర్మాణం పేరుతో ఇరవైదేశాలను మందీ మార్బలం వందిమాగదులకు ప్రయోజనం చేకూర్చే విధంగా తిరిగారు. ప్రత్యేక విమానాల్లో విలాస విహారాలు వినోద యాత్రలుగా మార్చి ఆర్ధికంగా అంతంత మాత్రంగా ఉన్న వ్యవస్థని నిర్వీర్యం చేశారు. చివరికి బాజపాని పెద్ద బూసిగా చూపుతూ - కడకు దక్షిణ ఉత్తర భారతాలనే విభేదాలను శృష్టించటానికి పన్నగాలు పన్నుతున్నారు. 

తాను రాజకీయస్వార్ధం కోసం చెసే ప్రతివ్యూహాన్ని ఈ వందిమాగధులు "చాణక్యం" గా చెపుతూ ధంకా భజాయించేస్తారు. అదే విధంగా వేరే రాజకీయ పక్షాలు వ్యూహం పన్నితే దానికి "మోసం దగా నేఱం" పేర్లతో దాడి చేస్తారు. తాను చేసింది రాజకీయం పరులు చేసింది వ్యభిచారం తాను చేస్తే చాణక్యం పరులు చేస్తే కౄరత్వం. ఇదీ ఒకరకం మీడియాలో ప్రతిద్వనులు కొనసాగించటం. ఈయన కో అంటే ఆ మీడియా కొండల్లో కో కో అని ద్వనిస్తాయి. అందుకే ప్రజల్లో ఆ వర్గ మెడియాపైనే విరక్తి పెరిగిపోతుంది. 


బిజెపి తో టిడిపి బ్రేక్-అప్ అయిందని రాం రాం చెప్పి తిరిగి అరుణ్ జైట్లిని కలిచారు చంద్రబాబు దూత సుజానా చౌదరి. దాన్ని టిడిపి మద్దతు మీడియా వేరెలాగా చెప్పటానికి ప్రయత్నిస్తుంది. అంతా బయటపడిన ఈ రహస్య మీటింగ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చిస్తున్నారు. చంద్రబాబు తో కలసి నడిస్తే కొంపలు మునిగేలా ఉన్నాయని ఆయన్ని ఆయన పార్టీని నమ్మలేమని టిడిపియేతర పార్టీలన్నీ ముక్త కంఠంతో చెపుతున్నాయి. 

చంద్రబాబు ఎన్ని కథలు చెప్పినా, టిడిపి బ్రతుకు బిజెపి దెబ్బకి బేజారై పోతుంది. అందుకే దిక్కుతోచని పరిస్థితుల్లోనుంచి పుట్టిందే ఈ "ఆపరేషన్ ద్రవిడ" ఇది అంతా అర్ధంకావాలంటే టిడిపి వారి పై ప్రజలు ఆపరేషన్ పరేషాన్ పేరుతో నిఘా పెడితే సరి.   
 
  
  
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: