బడిపిల్లల టాయిలెట్ల కోసం ఇచ్చిన నిధులను కూడా నాకేశారు: ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, అయితే నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అది సాధ్య మయ్యే అవకాశమేలేదన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. మట్టి నుంచి ఇసుక దాకా, పోలవరం నుంచి పట్టిసీమ దాకా లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఆఖరికి బడిపిల్ల ల టాయిలెట్ల కోసం ఇచ్చిన నిధులను కూడా చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఆసాంతం నాకేశారని మండిపడ్డారు.

అరుణ్‌ జైట్లీ సూచించినట్లు "స్పెషల్‌ స్టేటస్‌ వెహికల్‌" ఏర్పాటుచేస్తే, ప్రత్యేకహోదా హామీద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన అన్ని ప్రయోజనాలు అందుతాయని, ఈ విషయం లో బీజేపీ పై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వీర్రాజు స్పష్టం చేశారు. అయితే అవినీతి లో కూరుకుపోయిన చంద్రబాబు మాత్రం అందుకు సుముఖం గా లేరని, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఆయన రాష్ట్రాన్ని బలిపెడుతున్నాడని పేర్కొన్నారు. 

విజయవాడ లోని బీజేపీ కార్యాలయంలో శనివారం మీడియా తో మాట్లాడిన ఆయన, మాజీ బీజేపీ మిత్రుడి పై భారీ స్థాయిలో విమర్శల బాంబులు పేల్చారు. "ఆంధ్రప్రదేశ్ వర ప్రదాయిని పోలవరంతో పాటు పట్టిసీమ, రాయలసీమ ప్రాజెక్టులు అన్నీ అవినీతికి నిలయంగా మారాయని సోము వీర్రాజు తెలిపారు. పట్టిసీమలో అవినీతి తవ్వడానికి గునపాలు చాలవు. ఒక ట్రాక్టర్ మట్టి తీయడానికి ₹ 4లక్షలు తినేస్తున్నారు. పట్టిసీమ ₹1125 కోట్ల నుంచి మొదలై 1667 కోట్లకు వెళ్ళింది. 24పంపులు వేసి, 30 పంపులకు లెక్కలు కట్టారు. టెండర్లలో లేని వాటికి కోట్లు కుమ్మరించారు.

మట్టి పేరుతో ₹ 67 కోట్లు నొక్కేశారు. జన్మభూమి కమిటీల పేరు తో ఒక్కో ఇంటికి ₹ 20 వేలు వసూలు చేస్తున్నారు. కొత్త   పింఛన్ కు మూడు నెలల డబ్బులు ముందే తీసు కుంటున్నారు. "నీరు చెట్టు" ఒక నాటకం. ఆఖరికి స్కూళ్ల లో ఆడపిల్లల కోసం కట్టిన టాయిలెట్ల నిర్వహణ లోనూ చంద్రబాబు & కో నిధులు నాకేస్తున్నారు" అని సోము వీర్రాజు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: