కోహ్లీ, అనుష్క విలాసవంతమైన ఫ్లాట్.. అద్దె ఎంతో తెలుసా..!

Chakravarthi Kalyan
భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు. తన కెరీర్లోనే అత్యుత్తమ దశలో ఉన్నాడు. కేవలం కెరీర్లోనే కాదు..లైఫ్ లో కూడా విరాట్ కోహ్లికి ఇవి ఆనందకరమైన రోజులు.. కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగించిన ప్రేయని అనుష్క శర్మను కోహ్లీ ఇటీవల వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 


ముంబైలో సొంత ఇల్లు ఏర్పాటు చేసుకునే ఆలోచన ఉన్న విరాట్ కోహ్లీ, అనుష్క జంట.. ప్రస్తుతం ముంబైలోని ఓ విలాసవంతమైన ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారట. రెండేళ్ల కాలానికి ఈ విలాసవంతమైన ఫ్లాట్ ను ఒప్పందం కుదుర్చుకున్నారట. ఇంతకూ ఆ ఫ్లాట్ నెల అద్దె ఎంతో తెలుసా.. తెలిస్తే షాక్ అవ్వకమానరు. అవును మరి నెలకు అక్షరాలా 15 లక్షల రూపాయలు.. 


ఐతే.. ముంబైలోని ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్లో ఫ్లాట్ కొనాలని రెండేళ్ల క్రితమే అనుకున్నాడు. ఈ మేరకు అప్పుడే ఓ సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. ఆ అపార్ట్ మెంట్ 35వ ఫ్లోర్‌లోని 7,171 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్‌ను కొనుగోలు కోసం ఒప్పందం కూడా కుదిరింది. దాని ధర ఎంతో తెలుసా.. 34 కోట్ల రూపాయలు. 


అయితే .. ఇప్పుడా ఒప్పందాన్ని కోహ్లీ రద్దు చేసుకున్నాడట. ఈ విషయాన్నే ఆయనే చెప్పాడు. ప్రస్తుతానికి అద్దె ఇంట్లోనే కాపురం సాగిస్తారట. ఒప్పందం ఎందుకు రద్దు చేసుకున్నారనే విషయాన్ని మాత్రం కోహ్లీ బయటపెట్టలేదు. బహుశా అంత కన్నా విలాసవంతమైన ఫ్లాట్ చూసి ఉంటాడని అనుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: