స్టే ఉన్న కేసుల్లో విచారణ వేగం - చంద్రబాబుకు ఇక కష్టకాలం మొదలైంది

నేరపూరిత కేసులపై ఇచ్చే విచారణ నిలుపుదలను ఆరు నెలలకు మించి ఉండకూడదని సుప్రీం కోర్ట్ నిర్ధారించి బుదవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. నేఱస్థుల రకరకాల విన్యా సాలకు అడ్దుకట్ట వేయాలనేది సుప్రీం కోర్ట్ దృక్పధం. ఈ సుప్రింకోర్టు రూలింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పెద్ద ఝలకే కాదు దేహం ఝలధరించే టైం బాంబ్. ఇంతకీ సుప్రీం ఇచ్చిన రూలింగ్ మంటారా?


ఎటువంటి కేసైనా కానీ అత్యంత అధికంలో అధికంగా ఆరు నెలకు మించి "విచారణ నిలుపుదల" చేసేందుకు అవకాశం లేదన్నది తాజా రూలింగ్. ఎందుకంటే, ప్రతీ కేసు లోనూ విచారణ నిలుపు దల చేస్తున్న కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాదికేసులు సంవత్సరాల తరబడి విచారణకు రావట్లేదని న్యాయస్థానాలు భావిస్తున్నాయి. నేఱగాళ్ళు సహజంగానే తమ కేసులు విచారణను సాగదీసేలా చూస్తారు. దానికి రకరకాలుగా పన్నాగాలు కొనసాగిస్తూనే ఉంటారు.


విచారణ నిలుపుదలలు కేసులు సంవత్సరాలు కొనసాగించటంతో కాలయాపన వలన, సాక్షుల్లో అనేక మార్పులు రావచ్చు, లేదా సాక్షులు గాని పిర్యాదీదారులుగాని మరణించవచ్చు. అందుకే "న్యాయం ఆలస్యం అంటే న్యాయాన్ని నిర్లక్ష్యం చేయటమే" నన్న సామెత ఋజువౌతుంది. అందుకే ఈ రూలింగ్ ఇవ్వటంలోని ముఖ్య ఉద్దేశం.  


కాబట్టి ఏ కేసులో నైనా “అత్యధిక విచారణ నిలుపుదల సమయం  ఆరు నెలలకు మించటానికి వీలు లేదని” ఆరు నెలలు కాగానే తిరిగి విచారణ మొదలు పెట్టవలిసిందేనని  సుస్పష్టంగా ఆదేశాలిచ్చింది. ఒక వేళ ఆరు నెలల కన్నా మించి విచారణ నిలుపుదల చేయ వలసి వస్తే సదరు న్యాయమూర్తి దానికి కారణమైన అంశాలను వ్రాత మూలకంగా చెప్పాలట.


తాజాగా అసలు విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు అనేక సంవత్సరాల తరబడి విచారణ నిలుపుదల కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి సుప్రిం కోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీదున్న కేసులకు కూడా వర్తిస్తాయి.


సంవత్సరాల తరబడి ఇప్పటికే "స్టేలమీద స్టేలు" ఇస్తున్న చంద్రబాబు గారి కేసులు వెంటనే విచారణకు వస్తే నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం తల్లకిందులైనా ఆశ్చర్యం లేదు.


అందులోనూ టైమింగ్ సరిగ్గా ఎన్నికల వాడి వేడి తీక్షణంగా పెరుగుతున్న ఇటువంటి పరిస్థితుల్లో పరిణామాలు ఏ తీరాలకు దారితీస్తాయో? అసలే కాలం మన నాయకత్వానికి ఈ మద్య కలసి రావటం లేదు.


ఆదర్శ్ కె గోయల్, ఆరెఫ్ నారిమన్, నవీన్ సిన్-హా లతో కూడిన దర్మాసనం "సామాజిక బాధ్యత తో కూడి సమాజంపై శ్రద్దతో - అవినీతి నివారణ చట్టం పరిధిలోకి వచ్చే కేసుల వెంటనే పరిష్కరించకపోతే ఆ అవినీతి కేన్సర్ దేహంలోని ప్రముఖ అంగాలకు ప్రాకే అవకాశం ఉందని ఉద్ఘాటించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: