జగన్ కోసం ఉండవల్లి ఏం చేస్తున్నాడో తెలుసా ?

KSK

మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి రాజకీయాలలో అత్యంత ప్రీతిపాత్రుడు మరియు ప్రియశిష్యుడు అని అందరికీ తెలుసు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టుగా విభజించిన నేపథ్యంలో ఉండవల్లి అరుణకుమార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరమయ్యారు.


అయితే విభజన తర్వాత ఎన్నికల్లో పోటీచేయకుండా రాజకీయాలకు దూరంగానే ఉంటూ అప్పుడప్పుడూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా సమస్యల పట్ల అవినీతి పట్ల తనదైన శైలిలో స్పందిస్తూ  ఉన్నారు. కానీ తన గురువు రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ పట్ల ఆయన రాజకీయ భవిష్యత్తు పట్ల పరోక్షంగా ఇటీవల ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది లెక్క తేల్చడానికి జేఎఫ్సీ కమిటీ వేయడం జరిగింది.


ఈ కమిటీలో ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ని టిడిపి నుండి దూరం చేయడానికి చాలా కృషి చేసి ఆఖరికి దూరం చేసారు. ఈ విధంగా ఉండవల్లి కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేశారు.


అయితే తాజాగా ఇప్పుడు ఉండవల్లి విభజన చట్టం, కోర్టు కేసులు అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి నిద్రలేకుండా చేయడానికి పోలవరం ప్రాజెక్టుతో పాటు విభజన హామీల విషయాన్ని గురించి కోర్టుకి వెళ్ళే ఆలోచనలో వున్నారు ఉండవల్లి….ఈ విధంగా ఉండవల్లి తన రాజకీయ గురువు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ కి రాజకీయాలలో అడ్డులేకుండా బయట నుండే తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు ఉండవల్లి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: