జగన్ దిమ్మ తిరిగేలా.. బాబు కొత్త ఎత్తుగడ..!?

Chakravarthi Kalyan
విభజన హక్కుల సాధన కోసం ఇప్పటికే కేంద్రంపై పోరాట శంఖం ఊదేశారు చంద్రబాబు. ప్రత్యేక హోదా పోరులోకి లేట్ గా వచ్చినా లేటెస్టుగా అంతా తానే అంటున్నారు. ఈ విషయంలో మొదట్లో వైసీపీ దూసుకుపోయినా ఇప్పుడు చంద్రబాబు ఆ ఉద్యమాన్ని హైజాక్ చేసేశారు. ఇప్పడు చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా.. ఏ వేదిక ఎక్కినా చెబుతున్న ఒకటే మాట ప్రత్యేక హోదా ఉద్యమం.



ఐతే.. చంద్రబాబు జోరుకు అడ్డుకట్ట వేసేలా  జగన్ పావులు కదుపుతున్నారు. ప్రత్యేకహోదాపై కేంద్రం స్పందించకపోతే... పార్లమెంటు సమావేశాల చివరిరోజు తమ ఎంపీలు రాజీనామాలు చేయడంతోపాటు ఆంధ్రాభవన్ వద్ద ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారని జగన్ ఇప్పటికే ప్రకటించారు. వైసీపీ ఎంపీలకు  మద్ధతుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. కళాశాలల్లో విద్యార్థులు సైతం దీక్షలు చేపట్టి సంఘీభావం తెలిపాలని జగన్ కోరారు.


అదే జరిగితే వైసీపీకి మైలేజ్ రావడం ఖాయం. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు.. అందుకు ముందుగానే ఢిల్లీలో ఆమరణ దీక్షకు కూర్చోవచ్చని సమాచారం వస్తోంది. ఒకవేళ చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకుంటే ఢిల్లీలో సీన్ ఒక్కసారిగా మారిపోతుందనడంలో సందేహం లేదు. టీడీపీ ఇందుకు అనుగుణంగా వ్యూహం తయారు చేసినట్టు చెబుతున్నారు. అందుకే విభజన హామీల అమలులో  కేంద్ర నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ వివిధ రూపాల్లో నిరసన తెలిపిన సీఎం ఇక ఇప్పుడు హస్తిన కేంద్రంగా తన చాణక్యాన్ని ప్రదర్శించనున్నారు. 



ఈ నెల 3, 4 తేదీల్లో దిల్లీలో పర్యటించనున్న ముఖ్యమంత్రి  కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వివిధ పార్టీల మద్దతు కూడగట్టి  మోదీ సర్కారు తీరును ఎండగట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు టీడీపీ వర్గాల నుంచి కన్ఫర్మేషన్ వచ్చేసింది. చంద్రబాబు అంటేనే చాణక్యం.. మరి ఆ సీనియర్ చాణక్యుడు ఢిల్లీలో ఏఏ ఎత్తులు వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా చంద్రబాబు తన మార్క్ ప్రణాళికలతోనే ఢిల్లీ బాటపడతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలో చంద్రబాబుకు ఓ రేంజ్ ఉంది. 



ఆయనంటే వివిధ పార్టీల నాయకులు ప్రత్యేకంగా గౌరవిస్తారు. ఆయన మాటకు విలువ ఉంది. ఇప్పుడు ఢిల్లీలో యాంటీ బీజేపీ గాలి వీస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. ఇక ఢిల్లీ కేంద్రంగానే విభజన హామీల సాధన పోరు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించారు. ఇక ఆమరణ దీక్ష కూడా చేస్తే జగన్ కు అందనంత ఎత్తుకు వెళ్లిపోతారేమో.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: