జగనే కాబోయే సీఎం.. టీడీపీ ఫేస్ బుక్ పేజీ చెప్పింది..!?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రధాన పార్టీల సోషల్ మీడియా సెల్స్ బాగా యాక్టివ్ అయ్యాయి. ఏదో ఒక క్యాంపెయిన్ చేసే పనిలో పడ్డాయి.  తాజాగా ఇలాంటి ప్రయత్నం చేసిన తెలుగు దేశం సోషల్ మీడియా ప్రయత్నం అనూహ్యంగా బెడిసికొట్టిందట. ఆ పార్టీ ఫేస్ బుక్ పేజీ నిర్వహించిన పోల్ లో జగన్ ఈసారి సీఎం కావడం తథ్యం అని తేలిందట. 


తెలుగుదేశం పార్టీ ఫేస్ బుక్ పేజీలో పెట్టిన ఒపీనియన్ పోల్ లో మొత్తం 15వేల మంది వరకూ పాల్గొన్నారట. అందులో అత్యధికులు కాబోయే సీఎం జగన్ అని అభిప్రాయపడ్డారట. తాము ఊహించిన దానికి వ్యతిరేకంగా ఫలితాలురావడంతో తెలుగుదేశం సోషల్ మీడియా షాక్ అయ్యిందట. అప్పటికప్పుడు ఆ ఒపీనియన్ పోల్ ను ముగించేసి పేజీ నుంచి తొలగించిందట.


ఈ మొత్తం తతంగం పై ఆంగ్లపత్రిక దక్కన్ క్రానికల్ ఓ సవివరమైన ఆర్టికల్ రాసింది. వాస్తవానికి ఈ పోల్ మరికొన్ని రోజులు కొనసాగాల్సి ఉంది. తుది ఫలితాల వరకూ వేచి చూసే సాహసం చేయలేని తెలుగుదేశం సోషల్ మీడియా సెల్ దాన్ని క్లోజ్ చేసేసిందన్నమాట. మరి సోషల్ మీడియాలో తెలుగుదేశానికి అనుకూలంగా పెద్ద సైన్యమే పనిచేస్తుంటుంది. 


అలాంటిది ఏకంగా తెలుగుదేశం పార్టీ ఫేస్ బుక్ పేజీలోనే ఇలాంటి ఫలితం ఎలా వచ్చిందన్నది అంతుపట్టకుండా ఉంది. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కూడా యాక్టివ్ గానే ఉండటం వల్ల వాళ్లంతా దీనిపై కాన్సంట్రేషన్ చేసి ఫలితాలు జగన్ కు అనకూలంగా వచ్చేలా కృషి చేసి ఉండొచ్చు. ఏదేమైనా జగన్ అండ్ పార్టీకి ఇది కచ్చితంగా శుభవార్తే. ఏమంటారు..?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: