మహాభారత కాలంలోనే సాటెలైట్ అధారిత ఇంటర్నెట్ ఉపయోగంలో ఉండేది: బిప్లవ్ దేబ్.


భారత్ అలాంటిలాంటి దేశం కాదు బహుపురాతన కాలం అనగా ఒక ఐదువేల సంవత్సరాలకు పూర్వమే అంటే మహాభారత యుద్ధకాలములోనే అత్యున్నత సాంకేతికత ను, అంతర్జాలాన్ని, ఉపగ్రహాలని వినియోగించుకుందని అన్నారు త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్. ఆధునిక సమాచార విప్లవానికి ప్రాభవానికి పరిణామానికి మూలం భారత్లోనే ఉందని దాని అభివృద్ధి మూలాలన్నీ భారత్లోనే అంకురించాయని, సాంకేతిక సమాచార విప్లవ వైభవం అత్యున్నత దశలో ఉండటం వలననే అంధుడైన ధృతరాష్ట్ర మహారాజుకు సంజయుడు ఆనాడు జరిగిన పద్దెనిమిది అక్షోహిణుల సైన్యం పాల్గొన్న పద్దెనిమిది రోజుల కురుక్షేత్ర మహా యుద్ధాన్ని అనుక్షణం ప్రసారం చేసినట్లు అందిన సమాచారం తోనే వివరించగలిగాడని అన్నారు. 

ఆనాడే అద్భుత సాంకేతిక ఉపగ్రహాల ద్వారానే ఇంత విశ్లేషణాత్మక సమాచారాన్ని పొల్లుబోకుండా వివరించారని తెలిపారు. గత మంగళవారం త్రిపుర రాజధాని అగర్తలా లో ప్రఙ్జభవన్లో జరిగిన "కంప్యూటరైజేషన్ మరియు సంస్కరణలు - ప్రాంతీయ శిక్షణ తరగతులు" ఉద్దేశించి ప్రసంగించారు.  చారిత్రాత్మక కాలములో జరిగిన సాంకేతిక అభివృద్ధి ఏదో కారణంతో మరుగునపడి ఉండవచ్చని అన్నారు.


అదే సాంకేతికత ను ఈ రోజు జాతీయ సమాచార కేంద్రం (నేషనల్ ఇన్-ఫర్మాటిక్ సెంటర్ — ఎన్ ఐ ఏ) వినియోగించు కుంటుందని అన్నారు. ఈ విషయంలో ఆయన "ఎన్ ఐ ఏ"  ని అభినందిస్తూ - పాశ్చాత్య దేశాలు తాము కనుగొన్నామను కుంటున్న విఙ్జానం యాదార్ధగా భారత్ కు చెందినదని విశ్లేషించారు. అనెక మంది నేడు మైక్రోసాఫ్ట్ లాంటి కంపనీల్లో పనిచేసేవారిలో అత్యధిక సంఖ్య మనదేనని ఆయన ఘనంగా చెప్పారు. అంతేకాదు అంతటి గొప్ప సంస్కృతి భారత్ స్వంతమని కీర్తించారు. తిరిగి ప్రపంచ స్థాయిలో డిజిటలైజేషన్ దిశలో భారత ప్రధాని నరెంద్ర మోడీ భారత్ ను నడిపిస్తున్నారని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చాకే అంతర్జాల అధారిత ఉపగ్రహ సాంకేతికతను భారత్ ఇప్పుడు విరివిగా వినియోగించు కుంటుందని వ్యక్త పరచారు.
 
  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: