ఏపీ స్పీకర్ కోడెల సైకిల్ యాత్రలో అపశృతి

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించాలని గత కొంత కాలంగా ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్న విషయం తెలిసిందే.  అయితే కేంద్రంతో మొన్నటి వరకు స్నేహ సంబంధాలు కొనసాగించిన టీడీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.  ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పిన కేంద్రంతో ఇప్పుడు హీమీ తుమీ అంటూ యుద్దం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగడం..ఆయన పుట్టిన రోజు సందర్భంగా దీక్ష కూడా చేస్తున్నారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షకు మద్దతుగా, కేంద్రం తీరును నిరసనగా ఈ రోజు ఉదయం స్పీకర్ కోడెల సైకిల్ యాత్ర చేపట్టారు. వేలాది మందితో భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండ వరకు యాత్ర కొనసాగనుంది. రేపు నరసరావుపేట, సత్తెనపల్లిలో స్పీకర్‌ కోడెల దీక్ష చేయనున్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు ప్రతీ ఒక్కరూ సంఘీభావం ప్రకటించాలని స్పీకర్ కోరారు.ఈ సందరభంగా, స్పీకర్ సైకిల్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది.

యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ స్పీకర్ కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు స్వల్ప గాయమైంది. కానీ ఆయన మాత్రం గాయాన్ని కూడా లెక్క చేయకుండా స్పీకర్ సైకిల్ యాత్రను కొనసాగించారు. ఈ సందర్బంగా కోడెల మాట్లాడుతూ..రాష్ట్రానికి ఏర్పాటు లొనే అన్యాయం జరిగిందని రాజ్యంగా విరుద్ధంగా,న్యాయ విరుద్దంగా, ధర్మ విరుద్ధం గా రాష్ట్రాన్ని విడతీసారని గడచిన 4 సంవత్సరాలలో సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఇచ్చిన హామీలు,కేబినేట్ తీర్మాణాలన్ని తుంగలోతొక్కరని స్పీకర్ పేర్కొన్నారు.

కేంద్రప్రభుత్వం ఈ రోజుకైనా మేల్కొకపోతే మన రాష్ట్రం శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని కోడెల తెలియచేసారు. ఒక శాసనసభ స్పీకర్ గా తనకు పరిధులున్నా వాటితో పాటు భాద్యతలు కూడా ఉంటాయని అందుకే 5 కోట్ల మంది ప్రజలకు నష్టం జరిగినప్పుడు తాను చూస్తూ ఉరుకోలేనని, ఈ సైకిల్ యాత్ర ని ఒక పార్టీ కోసమో ఒక వ్యక్తి కోసమో చేయడం లేదని రాష్ట్ర ప్రజలను చైతన్యం చేయడం కోసం ప్రజల యొక్క పోరాటాన్ని కేంద్రానికి తెలిసేల చేసి కేంద్రాన్ని ఒత్తిడి చేయడం కోసమే ఈ సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: