'పికె వర్సెస్ వర్మ - కాపు వర్సెస్ రాజు' ట్వీట్ వార్ - పవన్ కళ్యాణ్ రోడ్డున పడ్దారు!

ఏమైనా ఆర్జీవిని ఎంతవారైనా మాటల పోరులో తట్టుకోవటం కష్టమే! అగాథా క్రిష్టీ రీడర్ కదా! ఆమాత్రం సత్తా ఉంటుంది మరి! ఇక్కడ తనను తన తల్లిని ఒక మాట అన్నందుకే ఇంతగా రెచ్చిపోయిన పవన్, రాజకీయంగా ఎలా వ్యూహాత్మకంగా ప్రవర్తించ గలడు? దీన్ని బట్టి ఇంత ఆవేశకావేశకాలున్న వ్యక్తి ఆలోచనా పరుడు కాలేడు. ఇప్పుడు "ఏపి ఎన్నికల సమరాంగణంలో చుర కత్తిలా మారిన జగన్, నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ రంగంలో భారత్ లోనే ప్రధమ స్థానంలో ఉన్నానని చెప్పుకొని మీ చేత కొనియాడ బడుతున్న అపరచాణక్యుడు  నారా చంద్రబాబునాయుణ్ణి ఒక్క క్షణమైనా బరిలో ఎదుర్కోగలడా?" అనేది పెద్ద సందేహమే.


అసలు తెలంగాణాలో మామూలుగా వాడే తిట్టును అంతగా పట్టించుకొని ఆయన పలుచనవ్వటం బాగా అనిపించలేదు.  


అయినా శ్రీనిరాజు లాంటి వ్యాపార ప్రముఖుణ్ణి చెత్త రాజకీయ రొంపిలోకి లాగటం పవన్ కు కూడా గౌరవప్రదం కూడా కాదు! టివి-9 ను తిట్టాలంటే ఏదో రవి ప్రకాష్ ను వాడేస్తే సరి! అసలు తన అనుచర గణానికి కనీసం శ్రీనిరాజెవరో కూడా తెలిసి ఉండకపోవచ్చు. రాజకీయనాయకునికి చావొచ్చే తరుణమొచ్చినా తానికా వందేళ్ళు బ్రతుకుతాను అనేలా ప్రవర్తించాలి గాని ఆఫ్ట్రల్ల్ ఒక నెట్ ట్రొలింగ్ గుండెబరువై చెల్లా చెదరైనట్లు బావిస్తే ఎలా?    


నిన్న ఉదయం నుంచి ట్వీట్లు దంచికొడుతున్నాడు పవన్ కళ్యాణ్. అనుక్షణం ఏదో ఒకట్వీట్ చేస్తూనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు, లోకేష్, ఆంధ్రజ్యోతి, టీవీ9 సీఈవోలపై నేరుగా విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్, తన తల్లిని అనరాని మాటలు అని పించిన వర్మపై సుడిగాలిలా విరుచుకు పడ్డారు. అయితే సరిగ్గా పవన్ పెట్టే ప్రతి ట్వీట్ కు వర్మ కూడా లాగికల్గా సమాధానం ఇస్తున్నాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య ఒకరేంజ్ ట్విట్టర్ వార్ పవన్ వర్సస్ వర్మ అన్నట్లు కొనసాగింది. 

₹10 కోట్లు ఖర్చుపెట్టి తన ప్రతిష్టను దిగజార్చేందుకు వర్మ, లోకేష్, ఆంధ్రజ్యోతి, టీవీ9 కలిపి తనపై ఇలా దాడికి పాల్పడు తున్నారని పవన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై వర్మ స్పందించాడు. పవన్ ను నెగెటివ్ గా కామెంట్ చేయనని అమ్మ మీద ఒట్టేశాను కాబట్టి లాజికల్ గా మాట్లాడతానంటూ తన వివరణ ప్రారంభించిన వర్మ,


ప్రపంచ ప్రఖ్యాత  "ఆగథా క్రిస్టీ" నవలల్లో కూడా పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్న రేంజ్ లో "కాన్స్పిరసీ థియరీ" (కుట్ర  సిద్ధాంతం, మోసం కపటం అంతర్లీనంగా శత్రువుని  కొట్టే చావు దెబ్బ) చదవలేదన్నాడు. 


"నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షను ప్రజల దృష్టి నుండి పక్కదోవ పట్టించడానికి, మహేష్ బాబు నటించిన రేంజ్ సినిమా 'భరత్ అను నేనూ సినిమా నుంచి ప్రేక్షకుల దృష్టిని దారి మళ్ళించటానికి పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నారని" నేను ఆరోపించగలనని, కానీ ఆ పని చేయనని - ఆ పని చేస్తూనే వర్మ సూటైన జవాబు గా బదులిచ్చాడు.


"తను ఏ క్షణానైనా చనిపోవడానికి సిద్ధపడి ముందుకెళ్తున్నానని" పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ పై అగ్ని కణికల్లాంటి విమర్శలు గుప్పించాడు వర్మ. హీరో అయిన పవన్ కళ్యాణ్ శత్రువుల్ని చంపాలి కానీ తన చావు గురించి ఆలోచించకూడదని అన్నారు.  "చావు గురించి మాట్లాడి తన అభిమానులకు వేదన కలిగించాడని, ఇలా మాట్లాడ్డం పవన్ కళ్యాణ్ పై నమ్మకం పెట్టుకున్న లక్షలాది మంది అభిమానులకు కోట్లాది మంది ప్రజలకు మంచిది కాదని అన్నాడు వర్మ.

తనపై విమర్శలు చేస్తున్న కూటమికి కూడా తల్లులు, సోదరీమణులు ఉన్నారని, కానీ వాళ్లను బాగానే కాపాడు కుంటా మరొకరి పై బురద జల్లుతున్నారనే పవన్ వ్యాఖ్యపై కూడా వర్మ స్పందించాడు. పవన్ తల్లిని తిట్టించినందుకు క్షమాపణలు చెప్పిన వర్మ, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు. "సింపతీ తో ఓటర్లను ఆకర్షించడానికి" పవన్ ఇదంతా చేస్తున్నాడంటూ వర్మ, పవన్ తనపై ఎక్కుపెట్టిన బాణాలను మరల పవన్ పైకే మరల్చాడు.

టీవీ9 లో మేజర్ వాటా కలిగిన శ్రీనిరాజు, తనది ఒకటే కులమని పవన్ ఆరోపించగా, దాన్ని అంగీకరించిన వర్మ, తను ఇప్పటి వరకు శ్రీనిరాజును కలవలేదని అంటున్నాడు. మరో ట్వీట్ లో శ్రీనిరాజు లేటెస్ట్ ఫొటోను పవన్ పోస్ట్ చేయగా, అభిమానులను రెచ్చగొట్టడానికే పవన్ ఇలా ఫొటోను పెడుతున్నారని వర్మ విమర్శించాడు. శ్రీనిరాజు మారువేషంలో తిరుగుతున్నాడని చెప్ప డానికి, శ్రీనిరాజుపై ఎటాక్ చేయమని అభిమానులకు చెప్పాలనే ఉద్దేశంతోనే పవన్  ఫొటోను పోస్ట్ చేశారని వర్మ ఆరోపించా డు. ఇలా పవన్, వర్మ మధ్య ఒక రేంజ్ లో "వార్ ఆఫ్ ట్వీట్స్ ఆన్ ట్విట్టెర్ స్టేజ్" గా నడిచింది. 


ఆఫ్ట్రాల్ ఒక అమ్మాయి రోడ్డు మీదకొచ్చి వివస్త్రై విలపించి నూరేళ్ళ సినిమా కాలంలో మహిళలపై జరుగుతున్న అదీ తను ప్రాధమ్యం వహిస్తున్న రంగం లో "కాస్టింగ్ కౌచ్" ను బట్టబయలు చేసినప్పుడు ఆ అమ్మాయిని ఆదుకొని వీలైతే కొందరు వెదవలపై చర్య తీసుకొని " జరిగిందేదో జరిపోయింది కదమ్మా! అని పదుగురిలో చెపితే" ఆయన కీర్తి దిగంతాలకు వ్యాపించేది.


అలాంటి మానవత ప్రకటించే సామాజిక రాజకీయ అవకాశాన్ని వదిలేసి - మా అమ్మను తిట్టారు తిట్టించారు అంటూ హడావిడి చేసి చప్పున జావగారి పోయిన పవన్ ఏమాత్రం ప్రజాక్షేత్రంలో పనికి రాడని నిర్ద్వందం గా చెప్పొచ్చు. రాజకీయ అఙ్జాని అని చెప్పటంలో సందేహించక్కర్లేదు. ఇదే అవకాశం చంద్రబాబు దొరికితే ₹100 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టైనా " మహిళా మాన సంరక్షణ దీక్ష" నిర్వహించి 20% ఓట్లు పుక్కటిగా గ్రాబ్ చేసే వారు. ఇక జగన్ కు దొరికితే "మహిళా రక్షణ కోసం సంకల్పం చేసుకొని మరో మహా ప్రత్యేక మహిళా ఓదార్పు యాత్ర" చేసేసి బహుశ 40% ఓట్లు పెంచుకొనేవాడు. 

ఒక ప్రక్క నాగబాబు మరో ప్రక్క మెగా హీరోల విపరీత నటనతో ఆయన రెచ్చిపోయి లాయర్లు! అదీయిదని హడావిడి చేసి తటస్థ ఓటర్లు "వీడు కూడ ఇంతే" అనేలా ప్రక్కన పడేసేలా ప్రవర్తించారు. ఖచ్చితంగా విజయం రావలసిన చోట అపజయం అప్రతిహతంగా మూటకట్టుకున్న పవన్ లోని "ఘాఢంగా పేరుకున్న అఙ్జానం " పారద్రోలటానికి ప్రపంచ ప్రఖ్యాత మనో విఙ్జాన శాస్త్రవేత్తలు పరిశోధన చేయాల్సిందే. ప్రస్తుతానికి బివి పట్టాభిరాం గారిని ఒకసారి కలిసి మాట్లాడితే మంచిది.  

రాజకీయాల్లో మెత్తని చురకత్తులే ఉంటాయి కాని కరవాలాలు ఉండవు. బహుశ పవన్ లాంటి స్ట్రేయిట్ ఫార్వార్ద్ పర్సన్ రాజ కీయ నాయకత్వానికి ఏమాత్రం తగడు. దీనికి ఆయింట్లో అల్లు అరవింద్ మాత్రమే సూటబుల్. కాని ఆయనకు ప్రజాభిమానం శూన్యం. 


పవన్ కళ్యాన్ అభిమానులకు ఒకటే విన్నపం "చట్టపరంగా ఇబ్బందులు వస్తే పవన్ కళ్యాణ్ మిమ్మల్ని రక్షించే  పరిస్థితు ల్లో ఉండరు.  సహాయం చేయరని కాదు కొన్ని సందర్బాల్లో ఆయన నిస్సహాయుడు అయ్యే పరిస్థితులు వస్థాయి. బ్లైండ్ గా ముందుకు పోవద్దు"

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: